PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024b331d861-25fc-49a3-842c-e8135352b58f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024b331d861-25fc-49a3-842c-e8135352b58f-415x250-IndiaHerald.jpgఎమ్మెల్సీలు వైసీపీకి షాకులు ఇస్తున్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌కి ఇస్తే ఆయన జనసేన పార్టీలోకి వెళ్లారు. ఆయన మీద శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేసి సభ్యత్వాన్ని వైసీపీ క్యాన్సిల్ చేయించింది.తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీ మీద కత్తులు దూశారు. అయితే ఇతను తెలివిగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు తన అనుచరులను తెలుగుదేశంలోకి పంపించారు. పార్టీ పదవితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కీలక నేతగా ఉన్న ఆయన భార్య కూAP Elections 2024{#}geetha;raghu;vamsi;Fort;Sasanamandali;Vijayanagaram;Vizianagaram;Vishakapatnam;Wife;MLA;Jagan;local language;Minister;Assembly;Janasena;YCP;MP;Partyవిశాఖ: వైసీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీలు?విశాఖ: వైసీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీలు?AP Elections 2024{#}geetha;raghu;vamsi;Fort;Sasanamandali;Vijayanagaram;Vizianagaram;Vishakapatnam;Wife;MLA;Jagan;local language;Minister;Assembly;Janasena;YCP;MP;PartyWed, 10 Apr 2024 11:39:13 GMTఎమ్మెల్సీలు వైసీపీకి షాకులు ఇస్తున్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పదవిని వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌కి ఇస్తే ఆయన జనసేన పార్టీలోకి వెళ్లారు. ఆయన మీద శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేసి సభ్యత్వాన్ని వైసీపీ క్యాన్సిల్ చేయించింది.తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీ మీద కత్తులు దూశారు. అయితే ఇతను తెలివిగా వ్యవహరిస్తున్నారు.  విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు తన అనుచరులను తెలుగుదేశంలోకి పంపించారు. పార్టీ పదవితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కీలక నేతగా ఉన్న ఆయన భార్య కూడా టీడీపీలో చేరారు. ఈ వైసీపీ ఎమ్మెల్సీ తన పైన అనర్హత వేటు పడకుండా వైసీపీలో ఉంటూ టీడీపీకి సాయం చేస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. దీంతో ఆయన మీద మంత్రి బొత్స సత్యనారాయణ కోపడ్డారు. ఇక్కడ జగన్ కోసమే ప్రజలు ఓటు వేస్తారని పార్టీలో ఎవరూ గొప్ప కాదని అన్నారు.ముసుగులు వేసుకుని పార్టీలో ఉంటున్న వారు వెళ్ళిపోవచ్చని  ఆయన స్పష్టం చేశారు. ఇంకా అంతే కాదు వైసీపీ నేతలు ఆయన మీద అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేశారు.


ఇక దీనిని శాసనమండలి చైర్ పర్సన్ కు  ఇచ్చారు. అక్కడ  చర్యలు ఎలా ఉంటాయో తెలియదు. అయితే పార్టీలోనే ఉన్న ఎమ్మెల్సీ మీద ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.అతను గీత దాటలేదు కదా అని వారు లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఆయన వైఖరి రెబెల్ ఎంపీ రఘురామ లాగా ఉందని అంటున్నారు. పార్టీలో ఆయన వ్యతిరేకంగా పనిచేసినా ఆధారాలు చూపించకపోతే అనర్హత వేటు పడదు. శాసనమండలి చైర్ పర్సన్ ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ ఆయన మీద వేటు వేయాల్సిందే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే రఘు రాజు అనుచరులు వెర్షన్ అయితే వేరేగా ఉంది.2024 ఎన్నికల్లో తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట తప్పారని వారు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం ఎస్ కోట నుంచి తిరుపతికి కాలినడకన వెళ్ళి వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఇపుడు అదే పార్టీకి కొరుకుడు పడకుండా మారారు అని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>