Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsf11424a4-3ae0-4664-83f6-4b2713025724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsf11424a4-3ae0-4664-83f6-4b2713025724-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అన్ని తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నాయి.. కూటమి వర్సస్ వైసీపీగా మారిన ఎన్నికల రాజకీయంలో ప్రస్తుతం కొత్త ట్విస్ట్ మొదలైంది.ప్రస్తుతం ఈ హోరా హోరి పోరులోకి కాంగ్రెస్ మరియు వామపక్షాల కూటమి కూడా జతయింది తాజాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్దుల రెండో విడత జాబితాను ప్రకటించారు. ఈ జాబితాతో వైసీపీ, ఎన్డీఏ కూటమిలో కాస్త టెన్షన్ మొదలైంది.వ్యతిరేక ఓటు చీలక తో పాటుగా తుది ఫలితాల తార#assembly elections{#}editor mohan;Tirupati;Eluru;Putalapattu;Tekkali;king;Elections;Janasena;Nellore;Congress;YCP;Partyఏపీ : కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఆ నియోజకవర్గాలలో లెక్కమారనుందా..?ఏపీ : కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఆ నియోజకవర్గాలలో లెక్కమారనుందా..?#assembly elections{#}editor mohan;Tirupati;Eluru;Putalapattu;Tekkali;king;Elections;Janasena;Nellore;Congress;YCP;PartyWed, 10 Apr 2024 12:33:11 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అన్ని తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నాయి.. కూటమి వర్సస్ వైసీపీగా మారిన ఎన్నికల రాజకీయంలో ప్రస్తుతం కొత్త ట్విస్ట్ మొదలైంది.ప్రస్తుతం ఈ హోరా హోరి పోరులోకి కాంగ్రెస్ మరియు వామపక్షాల కూటమి కూడా జతయింది. తాజాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్దుల రెండో విడత జాబితాను ప్రకటించారు. ఈ జాబితాతో వైసీపీ, ఎన్డీఏ కూటమిలో కాస్త టెన్షన్ మొదలైంది.వ్యతిరేక ఓటు చీలక తో పాటుగా తుది ఫలితాల తారు మారు పై ప్రస్తుతం అంచనాలు మొదలయ్యాయి.ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయగా, ఇప్పుడు రెండో జాబితా విడదుల చేసింది. లోక్‌సభకు 6, అసెంబ్లీకి 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ పలువురు సీనియర్లను బరిలోకి దించింది. అయితే ఎన్డీఏ కూటమి వర్సస్ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ నుండి సీనియర్ల మొహరింపుతో లెక్కలు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 

అందులో ఏలూరు నుంచి కావూరి లావణ్య, నెల్లూరు నుంచి కొప్పుల రాజు మరియు తిరుపతి నుంచి చింతా మోహన్ పోటీలో ఉండనున్నారు. అలాగే టెక్కలి అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన కిల్లి కృపారాణికి స్థానం దక్కింది. పూతలపట్టు నుంచి కూడా వైసీపీ నుంచి వలసొచ్చిన ఎం.ఎస్‌ బాబుకి టికెట్ దక్కింది.అయితే ఈ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఉన్న సమీకరణాలు అన్నీ మారిపోతున్నాయి.త్రిముఖ పోరు ఖాయంగా అయితే కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు కాంగ్రెస్ రాకతో కొత్త టెన్సన్ మొదలైంది.. తాజాగా కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా ఖరారు తరువాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక ఖాయంగా కనిపిస్తోంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా వైసీపీకి కలిసి వస్తుందని కూటమి అభ్యర్థులు కలవర పడుతున్నారు. మరి మున్ముందు దీని ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చుడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>