PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-gudivada-venigandla-ramu-ycp-tdpf083d448-8a46-402b-b4ed-efff1b335a85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-gudivada-venigandla-ramu-ycp-tdpf083d448-8a46-402b-b4ed-efff1b335a85-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి ఎంతోమంది నాయకులు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఎదిగారు. అలాంటి కృష్ణా జిల్లాలో మంచి ఆదరణ పొందినటువంటి నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గం నుంచి కొడాలి నాని మంచి ఆదరణ పొంది దూసుకుపోతున్నారు. అలాంటి కొడాలి నాని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా.?ఆ వివరాలు ఏంటో చూద్దాం.?గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని మరోసారి బరిలో ఉన్నారు. ఆయన ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ సానుభూతి మాటలు మాట్లాడుతూ ముKodali nani;Gudivada;venigandla ramu;ycp;tdp{#}Kodali Nani;krishna district;Kamma;Scheduled caste;Krishna River;Amarnath Cave Temple;ramu;District;Nani;Minister;MLA;Bharatiya Janata Party;TDP;YCP;Janasena;Party;Congressగుడివాడ: టిడిపి ప్లాన్ వర్కవుట్ అయితే నాని గెలుపు కష్టమేనా..?గుడివాడ: టిడిపి ప్లాన్ వర్కవుట్ అయితే నాని గెలుపు కష్టమేనా..?Kodali nani;Gudivada;venigandla ramu;ycp;tdp{#}Kodali Nani;krishna district;Kamma;Scheduled caste;Krishna River;Amarnath Cave Temple;ramu;District;Nani;Minister;MLA;Bharatiya Janata Party;TDP;YCP;Janasena;Party;CongressWed, 10 Apr 2024 18:30:16 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా  ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ జిల్లా నుంచి ఎంతోమంది నాయకులు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఎదిగారు. అలాంటి కృష్ణా జిల్లాలో  మంచి ఆదరణ పొందినటువంటి నియోజకవర్గం గుడివాడ.  ఈ నియోజకవర్గం నుంచి కొడాలి నాని మంచి ఆదరణ పొంది దూసుకుపోతున్నారు. అలాంటి కొడాలి నాని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా.?ఆ వివరాలు ఏంటో చూద్దాం.?గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా  కొడాలి నాని మరోసారి బరిలో ఉన్నారు. ఆయన ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ  సానుభూతి మాటలు మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత , 2004, 2009లో టిడిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 

2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి 2019లో  మరోసారి ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. ఈ విధంగా గుడివాడ అంటే నాని, నాని అంటే గుడివాడ అనే విధంగా తయారయ్యాడు. ఈసారి ఎలాగైనా గుడివాడలో మరోసారి గెలిసి రాజకీయ విరామం తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు.  కట్ చేస్తే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా  వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. అమెరికాలో ఈయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈయన రాజకీయాలకు కొత్త మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు.  అలాంటి రాముకు కలిసి వచ్చే ప్రధాన అంశం తన భార్య.  ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన  అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

 ఇదంతా పక్కన పెడితే రాము, నాని ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇందులో నాని చాలా సీనియర్ నాయకుడు. కానీ గుడివాడలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఓట్లు ఇద్దరు నేతలకు సమపాళ్లలో పడిన గుడివాడలో అత్యధిక ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి ఉన్నాయి. ఈ ఓట్లన్నీ రాము వైపు తిరిగే అవకాశం ఉందని  టిడిపి చాలా ఆలోచించి, వెనిగంటి రామును బరిలో దించింది. ఎందుకంటే రాము పెళ్లి చేసుకున్నది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి. ఆమె ద్వారా ఎస్సీ ఓట్లు  రాము వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది.  దీంతో పాటుగా బీజేపీ , జనసేన ఓట్లు కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని దారులు నానికి కాస్త ముళ్లదారులుగా మారే అవకాశం కనిపిస్తుందని, ఎన్నికల్లో నాని గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>