PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyancd143fb9-35a5-42c3-b4dd-a0c43150b231-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyancd143fb9-35a5-42c3-b4dd-a0c43150b231-415x250-IndiaHerald.jpgఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం రఘురామ టీడీపీలో ఉండగా ఆయన ఎన్నికల పోటీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ను తాజాగా కలిసిన రఘురామ కృష్ణంరాజు పవన్ గెలుపుపై జోస్యం చెప్పగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి తాను పిఠాపురం వచ్చానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. pawan kalyan{#}Kanumuru Raghu Rama Krishnam Raju;pithapuram;geetha;Parliment;CBN;kalyan;YCP;Janasena;House;MLAఏపీ : పవన్ గెలుపుపై రఘురామ జోస్యం.. ఆ స్థాయిలో మెజారిటీ సాధ్యమేనా?ఏపీ : పవన్ గెలుపుపై రఘురామ జోస్యం.. ఆ స్థాయిలో మెజారిటీ సాధ్యమేనా?pawan kalyan{#}Kanumuru Raghu Rama Krishnam Raju;pithapuram;geetha;Parliment;CBN;kalyan;YCP;Janasena;House;MLAWed, 10 Apr 2024 20:20:00 GMTఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం రఘురామ టీడీపీలో ఉండగా ఆయన ఎన్నికల పోటీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ను తాజాగా కలిసిన రఘురామ కృష్ణంరాజు పవన్ గెలుపుపై జోస్యం చెప్పగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి తాను పిఠాపురం వచ్చానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
 
పిఠాపురంలో ఉన్న ఓటర్లు మెగా ఫ్యామిలీని ఎంతగానో అభిమానిస్తారని 65 వేల మెజార్టీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఎంతమంది రెడ్లు ప్రయత్నాలు చేసినా పవన్ గెలవడం కచ్చితమని ఆయన పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు తిరుగులేదని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. తాను పవన్ తరపున ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.
 
చంద్రబాబు ఎక్కడినుంచి పోటీ చేయాలని చెప్పినా తాను పోటీ చేస్తానని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. కుదిరితే పార్లమెంట్ కు పోటీ చేస్తానని కుదరకపోతే అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీ నేతల పన్నాగాలకు ప్రజలే బుద్ధి చెబుతారని రఘురామ వెల్లడించారు. అయితే రఘురామ కృష్ణంరాజు చెప్పిన జోస్యం పవన్ విషయంలో నిజమవుతుందో చూడాలి.
 
పిఠాపురంలో సర్వేల ఫలితాలు ఒక్కో సర్వేలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. వంగా గీత లోకల్ అభ్యర్థి కావడంతో ఆమెకే ఓటు వేస్తామని కొంతమంది చెబుతున్నారు. పవన్ మాత్రం పిఠాపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ ఎన్నికల్లో గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. పవన్ సైతం గెలుపు విషయంలో నమ్మకాన్ని కలిగి ఉండగా ఆ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.  జనసేన పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. 21 స్థానాలలో కనీసం 15 స్థానాలలో విజయం సాధించినా జనసేన పార్టీ ఏపీలో మరింత బలోపేతం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>