Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thamannab3a6770c-4465-4010-836f-0d595a6750f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thamannab3a6770c-4465-4010-836f-0d595a6750f7-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయ్. అయితే ప్రచార రంగంలో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలి అనే విషయంపై ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్. ఇక కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లారు. తమను గెలిపిస్తే చేయబోయే పనులు ఏంటి అనే విషయంపై ఇక ప్రజలకు అర్థమయ్యేలా ప్రసంగాలు ఇస్తున్నారు. Thamanna{#}tamannaah bhatia;Bigboss;pithapuram;Mangalagiri;Tamannah Simhadri;Chaitanya;Sharmila;Parliment;Nara Lokesh;Hanu Raghavapudi;Andhra Pradesh;kalyan;Janasena;kadapa;Bharatiya Janata Party;Party;TDPఏపీ : పవన్ కళ్యాణ్ పై.. పోటీకి రెడీ అయిన ట్రాన్స్ జెండర్?ఏపీ : పవన్ కళ్యాణ్ పై.. పోటీకి రెడీ అయిన ట్రాన్స్ జెండర్?Thamanna{#}tamannaah bhatia;Bigboss;pithapuram;Mangalagiri;Tamannah Simhadri;Chaitanya;Sharmila;Parliment;Nara Lokesh;Hanu Raghavapudi;Andhra Pradesh;kalyan;Janasena;kadapa;Bharatiya Janata Party;Party;TDPWed, 10 Apr 2024 10:00:00 GMTఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయ్. అయితే ప్రచార రంగంలో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలి అనే విషయంపై ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్. ఇక కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లారు. తమను గెలిపిస్తే చేయబోయే పనులు ఏంటి అనే విషయంపై ఇక ప్రజలకు అర్థమయ్యేలా ప్రసంగాలు ఇస్తున్నారు. అంతేకాదు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తెరమీదకి తీసుకొస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంతో వాడేవేడిగా మారిపోయాయి అని చెప్పాలి. కాగా టిడిపి.. బిజెపి జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇంకో వైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. అయితే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ప్రచారం చేపట్టి ఇక అధికార పార్టీ తప్పులను ఏకీపారిస్తూ ఉన్నారు.


 అయితే ఇక ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం  గురించి ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇప్పుడు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కూడా పోటీ చేయబోతున్నారట. భారత చైతన్య యువజన పార్టీ తరపున ఆమె అక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారట. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కనిపించిన తమన్నా తెలుగు ప్రజలకు సుపరిచితురాలుగా మారారు. కొంతకాలం పాటు ఇక జనసేనలో కూడా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై మంగళగిరి నుంచి పోటీ చేశారు తమన్నా సింహాద్రి. ఇక ఇప్పుడు ఏకంగా కొన్నాళ్లపాటు జనసేనలో ఉండి ఇక ఇప్పుడు ఆ పార్టీ నుంచి తప్పుకుని అదే పార్టీఫై పోటీ చేయడానికి రెడీ అయ్యారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>