PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024a92b0a57-7ca1-4d21-9ff5-e99de9655da9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024a92b0a57-7ca1-4d21-9ff5-e99de9655da9-415x250-IndiaHerald.jpgవిశాఖలో ముఖ్యమైన నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో ఈసారి ఎన్నికల ఫలితం ఏమిటన్నది అందరిలో కూడా ఉత్కంఠ రేపుతోంది. గాజువాక పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి తలమానికం అయిన ఉక్కు కర్మాగారం ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ గత మూడేళ్ల నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం సాగుతోంది.వామపక్షాలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అలుపెరగని రీతిలో కొనసాగిస్తున్నాయి. ఉక్కులో బలంగా ఉన్న ఈ కార్మిక సంఘాలు సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఇక గాజువాకలో రెండున్నర లక్షల దాకా ఓటర్లు ఉంటే అAP Elections 2024{#}Vishakapatnam,Gajuwaka,workers,Minister,Bharatiya Janata Party,Andhra Pradesh,Party,Janasena,TDP,YCPవిశాఖ: ఉత్కంఠం రేపుతున్న గాజువాక పోటీ?విశాఖ: ఉత్కంఠం రేపుతున్న గాజువాక పోటీ?AP Elections 2024{#}Vishakapatnam,Gajuwaka,workers,Minister,Bharatiya Janata Party,Andhra Pradesh,Party,Janasena,TDP,YCPTue, 09 Apr 2024 08:56:49 GMTవిశాఖలో ముఖ్యమైన నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో ఈసారి ఎన్నికల ఫలితం ఏమిటన్నది అందరిలో కూడా ఉత్కంఠ రేపుతోంది. గాజువాక పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి తలమానికం అయిన ఉక్కు కర్మాగారం ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ గత మూడేళ్ల నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం సాగుతోంది.వామపక్షాలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అలుపెరగని రీతిలో కొనసాగిస్తున్నాయి. ఉక్కులో బలంగా ఉన్న ఈ కార్మిక సంఘాలు సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఇక గాజువాకలో రెండున్నర లక్షల దాకా ఓటర్లు ఉంటే అందులో రెండు వంతుల దాకా ఉక్కు కార్మికులు ప్రత్యక్షంగా  పరోక్షంగా ఉపాధిని అందుకుంటున్న వారు అనుబంధ సంస్థల కార్మికులు ఉన్నారు.వీరు 2019లో వైసీపీ- టీడీపీ జనసేనల మధ్య చీలిపోయారు. అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య అనేది లేదు.అయితే ఈసారి అదే టెస్టింగ్ పాయింట్ గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ. బీజేపితో పొత్తు పెట్టుకున్నది టీడీపీ జనసేన.


గాజువాకలో జనసేన సపోర్ట్ తో టీడీపీ పోటీ చేస్తోంది.ఇక అధికార వైసీపీ తరఫున మంత్రి గుడివాడ అమర్నాధ్ పోటీలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని ఈ 3 పార్టీలు హామీ ఇస్తున్నాయి. బీజేపీ అయితే ఈ ఇష్యూ ప్రస్తావనకు తేవడం లేదు. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులను మంచి చేసుకోవడానికి అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన ప్రయత్నాలు  చేస్తున్నాయి.ఈ క్రమంలో గాజువాక నుంచి పోటీకి సీపీఎం రెడీ అయింది.ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.  ఉక్కు ఉద్యమ ఫలితాన్ని రాజకీయంగా తన వైపు తిప్పుకోవడానికి సీపీఎం  బరిలోకి దిగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పోరాడుతున్న కార్మిక నేత సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు పోటీ చేస్తున్నారు. జగ్గునాయుడు ఇప్పటికే ఉక్కు కార్మికులు ఏపీలోని ప్రధాన పార్టీలు దేనికీ మద్దతు ఇవ్వవద్దటూ పిలుపునిచ్చారు.ఆయనే ఇపుడు పోటీ చేస్తున్నారంటే ఉక్కు కార్మికుల ఓట్లు సీపీఎం కి వెళ్తాయనే భావిస్తున్నారు. అవి ఎంత మేరకు వెళ్తాయి.సీపీఎం ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>