Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle270a4cd1-fea8-403d-85c6-9cb30e7a0962-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle270a4cd1-fea8-403d-85c6-9cb30e7a0962-415x250-IndiaHerald.jpgరౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.ఇక ఈ మూవీ తరువాత విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గతంలోనే గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఈ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో కూడా శ్రీలీల పాల్గొన్నారు. అయితే ఈమధ్యలో ఈ సినిమా నుంచి శ్రీలీల తsocialstars lifestyle{#}bhama;suryadevara nagavamsi;Nijam;Red chilly powder;Event;Pooja Hegde;producer;Producer;Audience;gautham new;gautham;vijay deverakonda;sithara;Heroine;Cinema;Guntur;Joseph Vijay;Teluguరౌడీ హీరోను వదులుకున్న శ్రీలీల...!!రౌడీ హీరోను వదులుకున్న శ్రీలీల...!!socialstars lifestyle{#}bhama;suryadevara nagavamsi;Nijam;Red chilly powder;Event;Pooja Hegde;producer;Producer;Audience;gautham new;gautham;vijay deverakonda;sithara;Heroine;Cinema;Guntur;Joseph Vijay;TeluguTue, 09 Apr 2024 16:00:00 GMTరౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.ఇక ఈ మూవీ తరువాత విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గతంలోనే గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఈ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో కూడా శ్రీలీల పాల్గొన్నారు. అయితే ఈమధ్యలో ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వచ్చింది. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం.. ఆ విషయంలో నిజం లేదని కొట్టేపారేసారు. కానీ ఇప్పుడు నిజంగానే శ్రీలీలని ఈ సినిమా నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. ఆమె ప్లేస్‌లోకి మలయాళ భామని తీసుకు వచ్చినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది.

గుంటూరు కారం సినిమా ఒకటి తప్ప, చివరిగా శ్రీలీల నటించిన ఏ సినిమా హిట్ అందుకోలేదు. ప్రస్తుతం శ్రీలీల కూడా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఆమధ్య గుంటూరు కారం కోసం తన ఎగ్జామ్స్ కి కూడా శ్రీలీల డుమ్మా కొట్టేసారు. ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చి స్టడీస్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందువలనే విజయ్ సినిమాలోకి మలయాళ భామ ‘మమితా బైజు’ని తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇటీవల ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన మమితా బైజు.. తన యాక్టింగ్ తో ఇక్కడ అబ్బాయిల మనసుని కొల్లగొట్టేశారు. దీంతో ఈ భామకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఈ ఫేమ్ ని గమనించిన నిర్మాత నాగవంశీ.. ఈ భామని విజయ్ సినిమాలోకి తీసుకున్నట్లు తెలుసుంది. మరి శ్రీలీల నిజంగానే ఈ సినిమా నుంచి తప్పుకుందా..? లేదా మమితా బైజుతో పాటు శ్రీలీల కూడా ఈ సినిమాలో కనిపించబోతుందా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>