MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakondaddfb0344-ceb4-40b6-8a8c-791d64736d01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakondaddfb0344-ceb4-40b6-8a8c-791d64736d01-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా చాలా తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నాడు. రెండు మూడు హిట్లతో తక్కువ టైంలో స్టార్ ఇమేజ్ సంపాదించుకోవడం అన్నది చెప్పుకోదగ్గ విషయమే కానీ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకటి రెండు సినిమాలు హిట్లు కాగానే నేనే తోపు తురుము అని అనుకుంటే ఖచ్చితంగా దారుణమైన నెగటివిటీకి బలైతారు. ఫస్ట్ స్టార్ ఇమేజ్ రాగానే మెల్లిగా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాలి. అలా జరగాలంటే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఏ సినిమా పడితే అది తీసి ఇంVijay Devarakonda{#}Taxiwala;netizens;kushi;Kushi;Devarakonda;Dil;dil raju;parasuram;gautham new;gautham;vijay deverakonda;Cinema;Joseph Vijayఇలాయితే విజయ్ సినిమా కెరీర్ కష్టమే?ఇలాయితే విజయ్ సినిమా కెరీర్ కష్టమే?Vijay Devarakonda{#}Taxiwala;netizens;kushi;Kushi;Devarakonda;Dil;dil raju;parasuram;gautham new;gautham;vijay deverakonda;Cinema;Joseph VijayTue, 09 Apr 2024 18:30:15 GMTవిజయ్ దేవరకొండ  టాలీవుడ్లో  స్టార్ హీరోల్లో ఒకరిగా చాలా తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నాడు. రెండు మూడు హిట్లతో తక్కువ టైంలో స్టార్ ఇమేజ్ సంపాదించుకోవడం అన్నది చెప్పుకోదగ్గ విషయమే కానీ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకటి రెండు సినిమాలు హిట్లు కాగానే నేనే తోపు తురుము అని అనుకుంటే ఖచ్చితంగా దారుణమైన నెగటివిటీకి బలైతారు. ఫస్ట్ స్టార్ ఇమేజ్ రాగానే మెల్లిగా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాలి. అలా జరగాలంటే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఏ సినిమా పడితే అది తీసి ఇండియాని షేక్ చేస్తా, అవార్డులాన్ని కాళ్ళ కిందకి వస్తాయంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. అలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యాలంటే సెన్సేషనల్ మూవీస్ తీయాలి.ఇక అసలు విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ హిట్టు చూసి సరిగ్గా 6 ఏళ్ళు పైనే అవుతుంది. టాక్సీవాలా సినిమా తరువాత ఒక్క యావరేజ్ హిట్టు కూడా లేదు.గతేడాది హిట్టు టాక్ తెచ్చుకున్న ఖుషి కూడా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేక నష్టాలతో ప్లాప్ గా మిగిలింది.


ఇక ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ తో వచ్చాడు. ఈ సినిమా డే 1 నుంచి ఘోరమైన అట్టర్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా ఏకంగా 45 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 50 కోట్ల దాకా ఉంటుంది. అందులో విజయ్ బడ్జెట్ ఏకంగా 20 కోట్లు. కానీ ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే కనీసం 20 కోట్ల గ్రాస్ కూడా క్రాస్ చేయలేకపోయింది. అసలు దిల్ రాజు   ఇంత బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు తీశాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత బడ్జెట్ పెట్టి తీసిన ఈ మూవీలో అసలు ఏముందబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు దిల్ రాజుని పరశురామ్ ఎలా ఒప్పించాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ అయినా కథ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా విజయ్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరి గౌతమ్ తిన్ననూరి సినిమాతోనైనా విజయ్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>