MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cba0e70a4c-4a9d-4397-94c7-5b8c6fba36d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cba0e70a4c-4a9d-4397-94c7-5b8c6fba36d7-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో కొంతకాలం క్రితం లడ్డు బాబు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పూర్ణ, భూమిక ముఖ్య పాత్రలలో నటించగా... త్రిపురనేని చిట్టిబాబు సోదరుడు అయినటువంటి త్రిపురనేని రాజేంద్ర ఈ సినిమాను మహారధి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా 2014వ సంవత్సరంలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా త్రిపురనేని చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ సినిమా ప్లాప్ కావడానికి గల కారణాలను... అలCb{#}Naresh;allari naresh;chitti babu;ravi babu;Ladoo;Maharathi;Bhumika Chawla;Tammudu;Thammudu;Box office;CBN;Parents;Cinema;ravi anchorనేను వద్దన్నా ఎక్కువ డబ్బులు పెట్టించాడు... దర్శకుడు వల్లే "లడ్డు బాబు" ఫ్లాప్ అయ్యింది... చిట్టిబాబు..!నేను వద్దన్నా ఎక్కువ డబ్బులు పెట్టించాడు... దర్శకుడు వల్లే "లడ్డు బాబు" ఫ్లాప్ అయ్యింది... చిట్టిబాబు..!Cb{#}Naresh;allari naresh;chitti babu;ravi babu;Ladoo;Maharathi;Bhumika Chawla;Tammudu;Thammudu;Box office;CBN;Parents;Cinema;ravi anchorTue, 09 Apr 2024 20:45:18 GMTఅల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో కొంతకాలం క్రితం లడ్డు బాబు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పూర్ణ, భూమిక ముఖ్య పాత్రలలో నటించగా... త్రిపురనేని చిట్టిబాబు సోదరుడు అయినటువంటి త్రిపురనేని రాజేంద్ర ఈ సినిమాను మహారధి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా 2014వ సంవత్సరంలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా త్రిపురనేని చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈ సినిమా ప్లాప్ కావడానికి గల కారణాలను... అలాగే ఈ సినిమా వల్ల ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో చిట్టిబాబు మాట్లాడుతూ ... నా తమ్ముడు లడ్డు బాబు సినిమాను నిర్మించాడు. కాకపోతే అతనికి సినిమా రంగంపై, కథలపై పెద్దగా పట్టులేదు. నేను ఆ సమయంలో రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ కథను మొదటి స్టేజిలో పెద్దగా పండించుకోలేదు.

ఇక ఆ తర్వాత ఈ సినిమా కథను నేను విన్నాను. ఆ తర్వాత రవి బాబుకు చెప్పాను ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ అయినా తమ పిల్లలు గుడ్డివాళ్ళు అయిన, చెవిటి వాళ్ళు అయినా ఇతర ఏ లోపంతో ఉన్న సమాజం వారిని కించపరిచిన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కించపరచరు. నువ్వు ఈ సినిమాలో అల్లరి నరేష్ తండ్రి పాత్ర చేస్తున్న కోటా తో ఎప్పుడు అతని తిప్పిస్తున్నావ్... అది అసలు వర్కౌట్ కాదు అన్నాను.

ఆయన దానికి మీరు ఓల్డ్... మీకు ఇప్పటి జనరేషన్ గురించి తెలియదు అన్నాడు. నేను దానితో సైలెంట్ అయ్యాను. అలాగే 6 కోట్లలో ఈ సినిమాను పూర్తి చేయాలి అని అన్నాను. వారు ఎనిమిది కోట్లకు మించి ఖర్చు పెట్టారు. అది కూడా వర్కౌట్ కాదు అన్నాను. అలాగే సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్లు వచ్చినప్పుడు కూడా దానిని కూడా వద్దన్నాడు. చివరకు సినిమా వల్ల ఎనిమిది కోట్ల నష్టం వచ్చింది. దీనంతటికీ రవి బాబు కారణం అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా చిట్టి బాబు చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>