PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-mahes-comments107f9647-8bfc-4ba9-87b7-56e9c9f568c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-mahes-comments107f9647-8bfc-4ba9-87b7-56e9c9f568c0-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ పైన ఆయన అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు.. ఇప్పటికే చాలామంది నేతలు సైతం రాజీనామా చేసి ఇతర పార్టీలలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ నేత పోతిన మహేష్ కూడా రాజీనామా చేశారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చేశారు.. అసలు పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని పవన్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాలేదని.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పని చేస్తున్నారంటూ మహేష్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ నిర్PAWAN KALYAN;MAHES;COMMENTS{#}రాజీనామా;Survey;politics;Sujana Choudary;Janasena;kalyan;TDP;Partyపవన్: జనసేన నేతపై తిరగబడుతున్న నేతలు.. ఇంతకంటే దారుణమా..?పవన్: జనసేన నేతపై తిరగబడుతున్న నేతలు.. ఇంతకంటే దారుణమా..?PAWAN KALYAN;MAHES;COMMENTS{#}రాజీనామా;Survey;politics;Sujana Choudary;Janasena;kalyan;TDP;PartyTue, 09 Apr 2024 10:45:14 GMTజనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ పైన ఆయన అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు.. ఇప్పటికే చాలామంది నేతలు సైతం రాజీనామా చేసి ఇతర పార్టీలలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ నేత పోతిన మహేష్ కూడా రాజీనామా చేశారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చేశారు.. అసలు పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని పవన్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాలేదని.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పని చేస్తున్నారంటూ మహేష్ తెలియజేశారు.


పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం కోసం క్యాడర్ పైన కార్యకర్తల పైన నేతల పైన ఎప్పుడు దృష్టి పెట్టలేదని.. పవన్ సిద్ధాంతాలు కూడా చాలా స్వార్థపూరితమైనవి అని, అందుకే ఆయనని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారంటూ తెలిపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము.. తమ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయని మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..  ఈయన 25 రోజుల లోపలే పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా? కేవలం 21 సీట్లతో పార్టీకి ఏం భవిష్యత్తు ఇస్తారు? అంటూ మహేష్ ప్రశ్నించారు.

జనసేన పార్టీలో పనిచేసిన వారందరికీ ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు ..? టిడిపి వారికి ఎందుకు ఇస్తున్నారు? పవన్ అందుకు సమాధానం చెప్పాలి.. అంటూ అందుకు తగ్గ ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని అవన్నీ బయటపెడతా అంటూ తెలిపారు.తన స్వార్థం కోసమే కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారని.. యువతను కూడా మోసం చేస్తున్నారంటూ వెల్లడించారు. మీ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏ విధంగా టికెట్ ఇచ్చారంటూ ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే అన్ని మర్చిపోతారా ఈ అంశం పైన సమాధానం చెప్పాలి అంటూ మహేష్ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు.. టిడిపి జనసేన పార్టీలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు జరుగుతున్నాయని.. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అసలు అడ్రస్ ఉండదంటూ తెలిపారు. సర్వే చేసినా గెలిచే చోటల్లా జనసేన టికెట్ ను టిడిపికి ఇచ్చేశారని మహేష్ వెల్లడించారు.. ఇప్పటికే చాలామంది నేతలు కూడా పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చేశారు.. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటా అంటూ అభిమానులు వాపోతున్నారు. మొత్తానికైతే సొంత నాయకుడిపైనే నేతలు తిరుగుబడుతూ ఉండడం పవన్ కు ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి లేదని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>