PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20243f716dd5-1e86-466b-b94a-8a6c21df882a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20243f716dd5-1e86-466b-b94a-8a6c21df882a-415x250-IndiaHerald.jpgవైసీపీ ఓట్లు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే పూర్తిగా కోస్తా జిల్లాల మీద పార్టీ దృష్టి పెట్టింది. కోస్తా జిల్లాలైన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి ఇంకా ఉత్తరాంధ్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.ఇవి మొత్తం ఏడు జిల్లాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే 101 ఉన్నాయి.వీటిలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్నది ఏకంగా 84 సీట్లు. అంటే అప్పట్లో వైసీపీ తుఫాను అలా బలంగా వీచింది అని చెప్పాలి. ఆ దెబ్బకు టీడీపీకి కంచుకోటలుగా చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇంకా అలాగే ఉత్తరాంధ్రAP Elections 2024{#}Krishna River;Koshta;Godavari River;Assembly;TDP;Guntur;Party;YCP;Hanu Raghavapudi;Janasenaవైసీపీ: ఆ జిల్లాలపై దృష్టి.. ఓట్లు రాలతాయంటారా?వైసీపీ: ఆ జిల్లాలపై దృష్టి.. ఓట్లు రాలతాయంటారా?AP Elections 2024{#}Krishna River;Koshta;Godavari River;Assembly;TDP;Guntur;Party;YCP;Hanu Raghavapudi;JanasenaTue, 09 Apr 2024 13:58:47 GMTవైసీపీ ఓట్లు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే పూర్తిగా కోస్తా జిల్లాల మీద పార్టీ దృష్టి పెట్టింది. కోస్తా జిల్లాలైన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి ఇంకా ఉత్తరాంధ్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.ఇవి మొత్తం ఏడు జిల్లాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే 101 ఉన్నాయి.వీటిలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్నది ఏకంగా 84 సీట్లు. అంటే అప్పట్లో వైసీపీ తుఫాను అలా బలంగా వీచింది అని చెప్పాలి. ఆ దెబ్బకు టీడీపీకి కంచుకోటలుగా చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇంకా అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలు కూడా వైసీపీ ఫ్యాన్ నీడకు చేరాయి.ఉమ్మడి క్రిష్ణా గుంటూరు జిల్లాలలో మొత్తం 33 సీట్లు ఉంటే అందులో ఏకంగా 29 సీట్లు వైసీపీకి దక్కాయి. ఉభయ గోదావరి జిల్లాలలో 34 సీట్లు ఉంటే 27 సీట్లు ఇంకా అలాగే ఉత్తరాంధ్రాలో 34 సీట్లు ఉంటే 28 సీట్లు వైసీపీ గెలుచుకుని బలంగా సత్తా చాటింది.అంటే మొత్తం 101 సీటకు 84 సీట్లు సాధించడం అంటే మామూలు సంగతి కాదు. అలా టీడీపీ కూసాలు అన్నీ కదిలించివేసింది వైసీపీ. కానీ ఇపుడు చూస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కృష్ణా , గుంటూరు జిల్లలలో 3 రాజధానులతో వ్యతిరేక ప్రభావం పడుతుందని భావిస్తోంది. 


ఇక ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం బలంగా ఉండొచ్చు. ఉత్తరాంధ్రాలో మునుపటి కంటే టీడీపీ పుంజుకుంది.దాంతో ఈసారి కోస్తా జిల్లాలలో గతంలో వచ్చిన 84 సీట్లలో తిరిగి ఎన్ని దక్కుతాయన్నది వైసీపీలో చర్చ సాగుతోంది. ఇందులో కనీసం యాభై నుంచి అరవై సీట్లు అయిన గెలుచుకుంటే మరోసారి అధికారం సొంతం అవుతుందని భావిస్తోంది. అందుకోసం గాను ఆపరేషన్ కోస్తా అని వైసీపీ యాక్షన్ ప్లాన్ కి దిగిపోతోంది.జనసేన టీడీపీ బీజేపీల పొత్తులలో సీట్లు దక్కక అసంతృప్తికి లోనయిన వారు అలాగే సీట్ల కోసం చాలా కాలంగా ఆశలు పెట్టుకుని దక్కని వారు చాలా మంది ఉన్నారు. సుమారుగా వందకు యాభై నియోజకవర్గాలలో చూస్తే కూటమిలో అసంతృప్తులు ఈ కోస్తా జిల్లాలలో ఉన్నాయని వైసీపీ అంచనా వేస్తుంది.దాంతో వీరిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకుంటే పొత్తు ఎత్తులు చిత్తు చేయడంతో పాటు 2019 నాటి బలాన్ని తాము తిరిగి పోందేందుకు వీలు కలుగుతుందని వైసీపీ భావిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>