PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu600df17b-c82e-453a-9f75-6683c3e1d710-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu600df17b-c82e-453a-9f75-6683c3e1d710-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే కీలకమైన ఈ సమయంలో జగన్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా కనిపిస్తుండగా చంద్రబాబు మాత్రం ఢీలా పడుతున్నారు. చంద్రబాబు, పవన్ ప్రచారాలు చప్పగా సాగుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు మొక్కుబడిగా ప్రచారం సాగిస్తున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. cm jagan{#}Godavari River;bhavana;MP;YCP;MLA;CBN;Jagan;Party;busఏపీ : ఆ విషయంలో జగన్ సక్సెస్ బాబు ఫెయిల్.. ఓటమి భయం కనిపిస్తోందిగా!ఏపీ : ఆ విషయంలో జగన్ సక్సెస్ బాబు ఫెయిల్.. ఓటమి భయం కనిపిస్తోందిగా!cm jagan{#}Godavari River;bhavana;MP;YCP;MLA;CBN;Jagan;Party;busTue, 09 Apr 2024 11:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే కీలకమైన ఈ సమయంలో జగన్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా కనిపిస్తుండగా చంద్రబాబు మాత్రం ఢీలా పడుతున్నారు. చంద్రబాబు, పవన్ ప్రచారాలు చప్పగా సాగుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు మొక్కుబడిగా ప్రచారం సాగిస్తున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
 
ఎన్ని హామీలు ఇస్తున్నా ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడం లేదనే భావన కూటమిలో ఉంది. వైసీపీ అధికారికంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కొత్త హామీలను ప్రకటించకపోయినా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి సపోర్ట్ ఉండటంతో ఆ పార్టీ ఏ మాత్రం టెన్షన్ పడటం లేదు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు జనం తండోపతండాలుగా హాజరవుతున్నారు.
 
జగన్ యాత్రలకు హాజరవుతున్న జనంలో సగం కూడా చంద్రబాబు సభలకు హాజరు కావడం లేదు. ఓటమి భయం చంద్రబాబులో కనిపిస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకతను అంతకంతకూ తగ్గించడంలో జగన్ సఫలమవుతుండగా చంద్రబాబుపై మాత్రం సామాన్య ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కూటమి సూపర్ సిక్స్ హామీలకు సైతం సరైన ప్రచారం దక్కట్లేదు.
 
చంద్రబాబు, జగన్ ఈ ఎనికల్లో అధికారం దక్కితే చాలని ఈ ఎన్నికల్లో గెలుపు పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోతే గెలిచిన పార్టీలోకి కీలక నేతలు వెళ్తారనే భయం కూడా టీడీపీ, వైసీపీలలో ఉంది. కనీసం 100 స్థానాలలో విజయం సాధిస్తే చాలని కూటమి, వైసీపీ కోరుకుంటున్నాయి. ఎంపీ స్థానాల కంటే ఎమ్మెల్యే స్థానాలపైనే ప్రధానంగా ఇరు పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సైతం వైసీపీ హవా ఉంటుందని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం సగం స్థానాల్లో విజయం సాధించినా వైసీపీ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>