PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-lo-big-fight-gelupu-evaridie494ab62-9a26-4a4e-8bcc-bd20790baeb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-lo-big-fight-gelupu-evaridie494ab62-9a26-4a4e-8bcc-bd20790baeb0-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎంతో గొప్ప రాజకీయ నాయకులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు. ఇక్కడి నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉద్యమకారుడు పుచ్చలపల్లి సుందరయ్య.. ఇలా ఎంతోమంది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు నెల్లూరు నుంచిTDP,YCP,VIJAYASAIREDDY,PRABHAKAREDDY,JAGAN,CHANDRABABU,AP{#}Vemireddy Prabhakar Reddy,Chakram,prabhakar,Chintamaneni Prabhakar,Parakala Prabhakar,Minister,Nellore,Congress,Jagan,TDP,YCPనెల్లూరు: అందరి చూపు నెల్లూరు వైపు..ఈ బిగ్ ఫైట్ లో గెలుపెవరిది.?నెల్లూరు: అందరి చూపు నెల్లూరు వైపు..ఈ బిగ్ ఫైట్ లో గెలుపెవరిది.?TDP,YCP,VIJAYASAIREDDY,PRABHAKAREDDY,JAGAN,CHANDRABABU,AP{#}Vemireddy Prabhakar Reddy,Chakram,prabhakar,Chintamaneni Prabhakar,Parakala Prabhakar,Minister,Nellore,Congress,Jagan,TDP,YCPTue, 09 Apr 2024 08:57:15 GMTఏపీ  రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎంతో గొప్ప రాజకీయ నాయకులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు.  ఇక్కడి నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉద్యమకారుడు పుచ్చలపల్లి సుందరయ్య.. ఇలా ఎంతోమంది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఈసారి  పెద్ద రెడ్ల మధ్య పోరు జరగబోతోంది.
 
ఒకే పార్టీలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి వీరిద్దరూ విడిపోయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఆర్థిక పరంగా కానీ, సామాజికపరంగా కానీ  సమానమైన వ్యక్తులు. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే  వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టిడిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇద్దరు నేతల మధ్య సమరం నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఇద్దరు నేతలు ప్రచారంలో మునిగిపోతూ నేను గెలుస్తానంటే, నేను గెలుస్తానని బలంతో ముందుకెళ్తున్నారు. ఇందులో కూటమి నుంచి బలపరిచిన అభ్యర్థి prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి ప్రజలకు చేసినటువంటి అన్యాయాలను బయటపెడుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తన వైపు తిప్పుకునేలా  మాటల తూటాలు పేలుస్తున్నారు.

 మరోవైపు విజయసాయిరెడ్డి తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ప్రభాకర్ రెడ్డిని నమ్మవద్దని, అతన్ని రాజకీయంగా నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లారని, రాజకీయ అవసరాలకు ఎలాంటి పనైనా చేస్తారని, అలా పార్టీలు మారే నాయకులను నమ్మవద్దు అనే నినాదంతో  ప్రజల్లోకి బలంగా దూసుకుపోతున్నారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి వైసీపీలో   జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి కీలక నేత. ఈ విధంగా ఇద్దరు  బలమైన నేతల మధ్య  పోటీ ఏర్పడడంతో నెల్లూరు లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>