PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nandyala-8bd929a8-b2bf-4409-9f90-dcbb04d82af9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nandyala-8bd929a8-b2bf-4409-9f90-dcbb04d82af9-415x250-IndiaHerald.jpgఏపీలో త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో కొన్ని నియోజక వర్గాలలో జరగబోతున్న ఎన్నికల విషయాలనేవి చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో నంద్యాల ఒకటి. అవును, ఆ జిల్లాలోనే మోస్ట పొలిటికల్ హాటెస్ట్ సెంటర్ ఒకటుంది. అదే బనగానపల్లె నియోజకవర్గం. ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మరియు అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య పోరు చాలా తీవ్రస్థాయిలో ఉండబోతుంది. ఈ క్రమంలోనే బనగానపల్లె రాజకీయం రోజురోజుకు సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎండలను సైతం హీటెక్కిస్తున్నట్టు కనబడుతోందిNandyala {#}KATASANI RAMI REDDY;Nandyala;MLA;Backward Classes;Reddy;TDP;YCPఏపీ: నంద్యాల నడిబొడ్డులో ఈసారి జెండా పాతేది ఎవరు?ఏపీ: నంద్యాల నడిబొడ్డులో ఈసారి జెండా పాతేది ఎవరు?Nandyala {#}KATASANI RAMI REDDY;Nandyala;MLA;Backward Classes;Reddy;TDP;YCPTue, 09 Apr 2024 15:30:00 GMTఏపీలో త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో కొన్ని నియోజక వర్గాలలో జరగబోతున్న ఎన్నికల విషయాలనేవి చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో నంద్యాల ఒకటి. అవును, ఆ జిల్లాలోనే మోస్ట పొలిటికల్ హాటెస్ట్ సెంటర్ ఒకటుంది. అదే బనగానపల్లె నియోజకవర్గం. ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మరియు అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య పోరు చాలా తీవ్రస్థాయిలో ఉండబోతుంది. ఈ క్రమంలోనే బనగానపల్లె రాజకీయం రోజురోజుకు సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎండలను సైతం హీటెక్కిస్తున్నట్టు కనబడుతోంది.

అవును, గత ఎన్నికల్లో బీసీపై కాటసాని స్వల్ఫ తేడాతో గెలవగా ఈసారి కాటసాని రామిరెడ్డిని ఎలాగైనా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బీసీ జనార్థన్ రెడ్డి మంచి పట్టుదలగా ఉన్నట్టు కనబడుతున్నారు. ప్రస్తుతం ఆయన సభావేదికలలో మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే అది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా కాటసాని బంధువులను టీడీపీలో చేర్చుకుని తన సొంత ఇలాకా అవుకులో క్యాడర్ ను ఖాళీ చేసే పనిలో పడ్డారు జనార్దన్ రెడ్డి. కట్ చేస్తే అటు చల్లా వర్గీయులు, ఇటు కాటసాని కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడం వలన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ తప్పడం లేదు.

అయితే, మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజక వర్గంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాటసాని రామిరెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడు. అయితే గత ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన అవుకు మండలంలోని వైసీపీ నేతలు ఇపుడు వరుసగా టీడీపీలోకి చేరడం ఇపుడు ఆయనకి మింగుడు పడడం లేదని టాక్ వినబడుతోంది. విషయం ఏమిటంటే కొద్ది నెలల క్రితం కాటసాని రామిరెడ్డి, ఓబుల్ రెడ్డిల గెలుపు కోసం కష్టపడి పని చేసిన యువనేత కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి ఇపుడు వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అవుకు మండలంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడం కొసమెరుపు. ఇపుడు ఇదే అంశాలు కాటసానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని బయట గుసగుసలు వినబడుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>