PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan6deab037-f8a9-46b5-8bae-fa30eee1d956-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan6deab037-f8a9-46b5-8bae-fa30eee1d956-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోగా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈయన జనసేన అనే పార్టీని స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన కొంతకాలానికి ఈయన సినిమాలు చేయను కేవలం రాజకీయాల్లోనే జీవితాన్ని గడుపుతాను అని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. అందుకు గల కారణాన్ని ఈయన వివరిస్తూ... పార్టీని నడపాలి అంటే డబ్బు చాలా అవసరం. నేను సినిమాలు చేసిన సమయంలో డబ్బులు వెనుక వేసుకోలేదు. కానీ పార్టీ నడపవలసి వచ్చినప్పుడు డబPawan{#}Tammudu;Thammudu;kalyan;Chiranjeevi;Elections;Bharatiya Janata Party;Telugu Desam Party;Janasena;Party"పవన్" కి "మెగా" సపోర్ట్ దొరికేసింది..!"పవన్" కి "మెగా" సపోర్ట్ దొరికేసింది..!Pawan{#}Tammudu;Thammudu;kalyan;Chiranjeevi;Elections;Bharatiya Janata Party;Telugu Desam Party;Janasena;PartyTue, 09 Apr 2024 09:38:40 GMTసినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోగా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈయన జనసేన అనే పార్టీని స్థాపించాడు. ఇక పార్టీని స్థాపించిన కొంతకాలానికి ఈయన సినిమాలు చేయను కేవలం రాజకీయాల్లోనే జీవితాన్ని గడుపుతాను అని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. అందుకు గల కారణాన్ని ఈయన వివరిస్తూ... పార్టీని నడపాలి అంటే డబ్బు చాలా అవసరం.

నేను సినిమాలు చేసిన సమయంలో డబ్బులు వెనుక వేసుకోలేదు. కానీ పార్టీ నడపవలసి వచ్చినప్పుడు డబ్బు చాలా అవసరం అవుతుంది. దానికి నాకు ఉన్న ఆప్షన్ కేవలం సినిమాలు మాత్రమే. అందుకే తక్కువ రోజుల్లో అయ్యే సినిమాలను చేస్తున్నాను అని ప్రకటించాడు. ఇక ఈయన కొంత సమయాన్ని సినిమాలకు కేటాయిస్తూనే ఎక్కువ సమయాన్ని రాజకీయాలపై పెడుతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం , బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. ఇక జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో మెగా కుటుంబం సపోర్ట్ ఉంటుందా..? లేదా అని ఎంతోమంది అనుకున్నారు. చాలా వరకు మెగా కుటుంబ సభ్యులు కూడా జనసేన పార్టీ ప్రస్తావన వస్తే తప్ప పెద్దగా స్పందించడం లేదు. దానితో వీరి సపోర్ట్ ఈ పార్టీకి పెద్దగా ఉండదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒక్కవ్సారిగా మెగా కుటుంబం సపోర్ట్ జనసేనకు ఫుల్ గా ఉన్నట్లు తెలిసిపోయింది. నిన్న మెగాస్టార్ చిరంజీవి "జనసేన" పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాన్ని ఇచ్చాడు.

ఇక జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం గురించి చిరంజీవి స్పందిస్తూ... అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా ... తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన ఆస్తిపాస్తుల్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న మనిషి తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్ప లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన పార్టీకి విరాళాన్ని అందించాను అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇలా చిరంజీవి స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద మొత్తంలో డబ్బు విరాళంగా ఇవ్వడంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ మద్దతు పూర్తిగా ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>