PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool5a6dbf83-f30f-4000-8343-1b8d895a826a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool5a6dbf83-f30f-4000-8343-1b8d895a826a-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలో వైసీపీకి లోకల్‌, నాన్‌లోకల్‌ గొడవలు చాలా తలనొప్పిగా మారాయి. సీఎం జగన్ ఇతర నియోజక వర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీంతో ఆయా నియోజక వర్గాల్లోని కార్యకర్తల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది అని గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమిటంటే కోడుమూరు నియోజక వర్గంలో ఆదిమూలపు సతీష్‌ స్థానిక అభ్యర్థి కాకపోవడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని kurnool{#}sudigali sudheer;Prakasam;Doctor;Yemmiganur;SV Mohan Reddy;hafiz saeed;Kurnool;Elections;local language;MLA;kadapa;CM;Party;Jaganఏపీ: వైసీపీకి మరో షాక్... కర్నూలులో లోకల్‌-నాన్‌లోకల్‌ వార్స్ షురూ?ఏపీ: వైసీపీకి మరో షాక్... కర్నూలులో లోకల్‌-నాన్‌లోకల్‌ వార్స్ షురూ?kurnool{#}sudigali sudheer;Prakasam;Doctor;Yemmiganur;SV Mohan Reddy;hafiz saeed;Kurnool;Elections;local language;MLA;kadapa;CM;Party;JaganTue, 09 Apr 2024 17:30:00 GMTఏపీలో ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలో వైసీపీకి లోకల్‌, నాన్‌లోకల్‌ గొడవలు చాలా తలనొప్పిగా మారాయి. సీఎం జగన్ ఇతర నియోజక వర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీంతో ఆయా నియోజక వర్గాల్లోని కార్యకర్తల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది అని గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమిటంటే కోడుమూరు నియోజక వర్గంలో ఆదిమూలపు సతీష్‌ స్థానిక అభ్యర్థి కాకపోవడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయకుండా స్థానికేతరుడికి టిక్కెట్‌ ఇవ్వడంతో అక్కడ స్థానికులు గుర్రుగా వున్నారు. ఇపుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వారు బరస్ట్ అవుతున్నట్టు భోగట్టా.

ఈ క్రమంలోనే టికెట్ ఆశించిన దాదాపు 10 మంది స్థానిక పార్టీ నేతలు ఇపుడు ప్రతిపక్ష పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు స్థానికులు సొంత పార్టీ స్థానిక అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా సమాచారం. కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ ఇపుడు బరిలో ఉన్నారు. అతను నియోజకవర్గంతో పాటు రాజకీయాలకు కూడా పెద్దగా అనుభవం లేని వ్యక్తి. కాగా ఇంతియాజ్ పేరును పార్టీ ప్రతిపాదించకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ కోసం లాబీయింగ్ చేశారు. అయితే ఏఎమ్‌డి ఇంతియాజ్ ప్రకటనతో హఫీజ్ ఖాన్ మద్దతుదారులు నియోజకవర్గంలో చురుకుగా పాల్గొనడం లేదని తెలుస్తోంది.

అదేవిధంగా యెమ్మిగనూరు నియోజక వర్గంలో బుట్టా రేణుక కూడా స్థానికురాలు కాకపోవడం కొసమెరుపు. అది మాత్రమే కాకుండా నంది కొట్కూరు నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా స్థానికేతర డాక్టర్ సుధీర్ ధారకు టికెట్ కేటాయించారు. సుధీర్ స్వస్థలం కడప జిల్లా పులివెందుల. కర్నూలు జిల్లాతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్‌లు చాలా అశాంతితో ఉన్నారు. అయితే ఇపుడు ఇదే అంశాలు వైసీపీకి చాలా తలనొప్పిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>