MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd70523a58-7451-4750-9a5e-c34fdd688507-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd70523a58-7451-4750-9a5e-c34fdd688507-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీత గోవిందం లాంటి విజయవంతమైన సినిమాలతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే స్థాయికి చేరుకున్నాడు. ఇలా నటించిన సినిమాలలో ఎక్కువ శాతం చిత్రాలు సక్సెస్ కావడంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఈయన దగ్గరికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అందులో భాగంగా ఈయన కూడా ఆచితూచి భారీ క్రేజ్ ఉన్న సినిమాలను ఎంచుకున్నాడు. అందులో భVd{#}Geetha Govindam;Gita Govindam;Box office;parasuram;vijay deverakonda;Joseph Vijay;Success;Cinema;Audience;Arjun;marriage;Teluguఈ కలెక్షన్లు ఏంటి.. విజయ్ కి మరో దెబ్బ పడినట్లేనా..?ఈ కలెక్షన్లు ఏంటి.. విజయ్ కి మరో దెబ్బ పడినట్లేనా..?Vd{#}Geetha Govindam;Gita Govindam;Box office;parasuram;vijay deverakonda;Joseph Vijay;Success;Cinema;Audience;Arjun;marriage;TeluguTue, 09 Apr 2024 21:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీత గోవిందం లాంటి విజయవంతమైన సినిమాలతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే స్థాయికి చేరుకున్నాడు. ఇలా నటించిన సినిమాలలో ఎక్కువ శాతం చిత్రాలు సక్సెస్ కావడంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఈయన దగ్గరికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అందులో భాగంగా ఈయన కూడా ఆచితూచి భారీ క్రేజ్ ఉన్న సినిమాలను ఎంచుకున్నాడు.

అందులో భాగంగా ఈయన గీత గోవిందం తర్వాత చాలా సినిమాలలో హీరోగా నటించాడు. కానీ అవి ఏవి ఈయనకు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేదు. ఇలా వరుస అపజయాలతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న విజయ్ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీలో హీరోగా నటించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. గీత గోవిందం కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పెద్ద టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. మొదటి వీకెండ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకు కేవలం 19 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
 
మూవీ మరో 45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనబడడం లేదు. ఒక వేళ ఈ సినిమా కనుక బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోనట్లు అయితే విజయ్ కి మరో ఫ్లాప్ ఎదురైనట్లే అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>