MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinie3cd7d44-be02-4fff-8d5f-bc8cbb094022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinie3cd7d44-be02-4fff-8d5f-bc8cbb094022-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రజిని తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో భాషా మూవీ ఒకటి. 1995 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రజిని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో రజిని రెండు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఒక దాంట్లో మాఫియా డాన్ పాత్రలో కనిపించగా ... మరొక పాత్రలో ఈయన ఆటో డ్రైవర్ గా కనిపించాRajini{#}Nagma;raghuvaran;Blockbuster hit;Driver;Suresh;Hero;cinema theater;Posters;Box office;Cinema"బాషా" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!"బాషా" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!Rajini{#}Nagma;raghuvaran;Blockbuster hit;Driver;Suresh;Hero;cinema theater;Posters;Box office;CinemaTue, 09 Apr 2024 12:31:44 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రజిని తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో భాషా మూవీ ఒకటి. 1995 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రజిని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో రజిని రెండు విభిన్నమైన పాత్రలలో నటించాడు. 

ఒక దాంట్లో మాఫియా డాన్ పాత్రలో కనిపించగా ... మరొక పాత్రలో ఈయన ఆటో డ్రైవర్ గా కనిపించాడు. రెండిటిలో కూడా తాను అద్భుతమైన వేరియేషన్స్ కనబరిచి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ మూవీ లో నగ్మా హీరోయిన్ గా నటించగా ... రఘువరన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు. ఇక ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ మూవీ రీ రిలీజ్ కోసం రజిని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>