MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa962bb0ba-09fa-46f0-9c7a-45b865bf037f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa962bb0ba-09fa-46f0-9c7a-45b865bf037f-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 1" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న "పుష్ప పార్ట్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మAa{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Sangeetha;Anasuya;Kannada;sunil;Hindi;Tamil;Telugu;Hero;Allu Arjun;rashmika mandanna;sree;Beautiful;Director;Heroine;Cinema"పుష్ప 2" టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"పుష్ప 2" టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Aa{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Sangeetha;Anasuya;Kannada;sunil;Hindi;Tamil;Telugu;Hero;Allu Arjun;rashmika mandanna;sree;Beautiful;Director;Heroine;CinemaTue, 09 Apr 2024 13:25:00 GMTఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 1" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న "పుష్ప పార్ట్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... మలయాళ స్టార్ నటుడు ఫాహధ్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ నిన్న అనగా ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ టీజర్ కు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ కు 24 గంటల సమయంలో 39.36 మిలియన్ వ్యూస్ ... 1.25 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>