Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections160e229c-3443-4557-a92b-42d247fa8501-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections160e229c-3443-4557-a92b-42d247fa8501-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఇలా ఒకేసారి రెండు ఎన్నికలు జరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హంగామా కొనసాగుతుంది..రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో టిడిపి మొదటిసారి అధికారాన్ని చేపట్టింది.. కానీ వారి అధికారం ఎక్కువ కాలం కొనసాగలేదు.. గత ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.వైసిపి పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో మరో 30 ఏళ్లు అధికారంల#assembly elections{#}Kerala;pragathi;politics;Assembly;Reddy;Telangana;Andhra Pradesh;Jagan;Elections;central government;Parliment;Bharatiya Janata Party;Party;YCP;TDP;Governmentజగన్ ఐదేళ్ల పాలన ఎవరిని ఉద్దరించింది..?జగన్ ఐదేళ్ల పాలన ఎవరిని ఉద్దరించింది..?#assembly elections{#}Kerala;pragathi;politics;Assembly;Reddy;Telangana;Andhra Pradesh;Jagan;Elections;central government;Parliment;Bharatiya Janata Party;Party;YCP;TDP;GovernmentMon, 08 Apr 2024 11:49:31 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఇలా ఒకేసారి రెండు ఎన్నికలు జరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హంగామా కొనసాగుతుంది..రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో టిడిపి మొదటిసారి అధికారాన్ని చేపట్టింది.. కానీ వారి అధికారం ఎక్కువ కాలం కొనసాగలేదు.. గత ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.వైసిపి పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది.అలాగే ప్రతి పక్ష పార్టీలు కూడా అధికార ప్రభుత్వాన్ని గద్దె దించదానికి వారి తప్పులను మోసాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నాయి.దీంతో ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా వుందో ఏ పార్టీ బలహీనంగా వుందో అంచనావేయడం రాజకీయ విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది. 

అయితే వైసీపీ ప్రస్తుత పాలన, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరుతున్నారు.ఇక ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బిజెపి లు పొత్తులపై ఎంతో నమ్మకంతో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండేందుకు ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అసెంబ్లీ, లోక్ సభ బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే ఇరుపక్షాలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. ఈ ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది శూన్యం అని వైసిపి నాయకులు ప్రజాధనాన్ని  దోచుకున్నారని ప్రతిపక్ష కూటమి తీవ్రంగా ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని అన్ని రంగాలలో అభివృద్ది కుంటుపడిందని వారు ఆరోపిస్తున్నారు.  ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో వివిధ రంగాల గురించి అధికారిక లెక్కలు ఇలా ఉన్నాయి..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలోని అన్నిరాష్ట్రాల్లో విద్యావ్యవస్థపై సమీక్ష జరిపి దీని ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మొదటిస్థానంలో ఉండగా ఆంధ్ర ప్రదేశ్ నాలుగు, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. విద్యావ్యవస్థ సరిగ్గా లేకుంటే అక్కడ నిరుద్యోగం కూడా ఎక్కువగానే వుంటుంది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగిత రేటు 65 శాతంగా వున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.  నిరుద్యోగం ఎక్కువగా వుండటంతో ఆంధ్రప్రదేశ్ లో సమాజ ప్రగతి కూడా కుంటుపడుతుంది. 

కేంద్ర ప్రభత్వం 2023 లో విడుదల చేసిన 'సామాజిక ప్రగతి సూచీ' నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 23వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల వారిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తే చాలు ఎలాంటి సంక్షేమ పథకాల అవసరం వుండదని చాలా మంది  విశ్లేషకులు అంటుంటారు. వీటిని కూడా అభివృద్ది సూచికలుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నిస్తుంటాయి..అయితే జగన్ ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం కోసం మంచి ప్రయత్నమే చేసిందని తెలుస్తుంది... ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని నియమించి తద్వారా ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ సమాచారాన్నివిడుదల చేసింది.అభివృద్దికి సూచికగా రాష్ట్ర జిఎస్ డిపిని పేర్కొంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్ డిపి తక్కువగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి.ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ కాస్త మెరుగ్గా వుంది. తలసరి ఆదాయం పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా వున్నట్లు తెలుస్తుంది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>