Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila28db68d8-b68b-444c-9ece-6cadfa5003ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila28db68d8-b68b-444c-9ece-6cadfa5003ac-415x250-IndiaHerald.jpgఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల పాలిటిక్స్ ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఒక లక్ష్యం అనేది లేకుండా కేవలం పార్టీని నిలబెట్టిన తనను అన్న పక్కన పెట్టాడు.. అన్నపై పగ తీర్చుకోవాలి అనే ఒకే ఒక కారణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల... ప్రజలకు సేవ చేయడం ఏమో కానీ అన్నను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అన్నది తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. ఇక కడప నుంచి సొంత సోదరుడైన వైయస్ అవినాష్ రెడ్డి పైనే ఇక ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయింది.Sharmila{#}Prasthanam;Service;Y. S. Rajasekhara Reddy;devineni avinash;kadapa;Sharmila;Andhra Pradesh;Telangana;Congress;Jagan;YCP;Partyషర్మిల : లక్ష్యం లేని రాజకీయం.. ఆ డబ్బులన్నీ బొక్కే?షర్మిల : లక్ష్యం లేని రాజకీయం.. ఆ డబ్బులన్నీ బొక్కే?Sharmila{#}Prasthanam;Service;Y. S. Rajasekhara Reddy;devineni avinash;kadapa;Sharmila;Andhra Pradesh;Telangana;Congress;Jagan;YCP;PartyMon, 08 Apr 2024 15:15:00 GMTఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల పాలిటిక్స్ ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఒక లక్ష్యం అనేది లేకుండా కేవలం పార్టీని నిలబెట్టిన తనను అన్న పక్కన పెట్టాడు.. అన్నపై పగ తీర్చుకోవాలి అనే ఒకే ఒక కారణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల... ప్రజలకు సేవ చేయడం ఏమో కానీ అన్నను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అన్నది తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. ఇక కడప నుంచి సొంత సోదరుడైన వైయస్ అవినాష్ రెడ్డి పైనే ఇక ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయింది.


 ఈ క్రమంలోనే జగన్ పార్టీని ఉద్దేశిస్తూ షర్మిల చేస్తున్న విమర్శలు.. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే మొదటి నుంచి షర్మిల రాజకీయ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగానే సాగుతుంది. అసలు ప్రత్యక్ష రాజకీయాలతో ఎక్కడ సంబంధం లేని షర్మిళ 2012లో అన్న జైలుకు వెళ్ళగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టేందుకు రంగంలోకి దిగారు.  తల్లి విజయమ్మతో కలిసి ఏకంగా వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేపట్టి వైసిపి ఘన విజయాన్ని సాధించేందుకు కృషి చేశారు. ఇక ఆ సమయంలో  దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసింది షర్మిల.


 ఇలా అన్న పార్టీని నిలబెట్టేందుకు ఎంతో శ్రమించింది  కానీ వైసిపి అధినేత జగన్ మాత్రం చెల్లెకి కీలక పదవులు కట్టబెట్టకుండా.  పక్కన పెట్టడంతో అసంతృప్తి చెందిన షర్మిల ఆంధ్ర రాజకీయాల నుంచి తప్పుకుంది. 2021 ఫిబ్రవరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. నేను తెలంగాణ ఆడబిడ్డను అని నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టింది. కానీ తెలంగాణలో ఆదరణ అంతంత మాత్రమే అని తెలుసుకున్న షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇక మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు షర్మిల.


 అన్న జగన్ తో విభేదాలు వచ్చినప్పుడు ఎక్కడో రాజకీయంగా ఎదగడం ఎందుకు ఆంధ్రాలోనే అన్న పైనే పోటీ చేస్తానని మొండి పట్టు పట్టింది షర్మిల. ఇక ఇప్పుడు అన్నను గద్దె దించి పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది. అయితే అధికారంలోకి రావాలి.. ప్రజలకు ఏదో చేయాలి అనే లక్ష్యం మాత్రం షర్మిల లో కనిపించడం లేదు. ఇప్పుడు వరకు రాజకీయాల కోసం షర్మిల ఖర్చుపెట్టిన డబ్బు మొత్తం నీటిలో పోసిన పన్నీరుగానే మారిపోయింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో క్రియ శీలకంగా వ్యవహరించేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్ర చేయడమే కాదు.. పార్టీని నిలబెట్టుకునేందుకు భారీగానే ఖర్చు పెట్టింది షర్మిల. తెలంగాణ రాజకీయాల నుంచి ఆమె తప్పుకోవడంతో ఈ ఖర్చు అంతా  వృధాగానే మారిపోయిందని.. తెలంగాణలో పార్టీ పెట్టడం విషయంలో షర్మిల కాస్త ముందుచూపుతో ఆలోచించి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>