PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024c2b49894-08bb-44dc-ae7f-435e8d913561-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024c2b49894-08bb-44dc-ae7f-435e8d913561-415x250-IndiaHerald.jpgవిజయనగరం అసెంబ్లీ సీటులో ఈసారి పోటీ చాలా రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తాను రాజకీయంగా పదవీ విరమణ చేసి మరీ కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది.విజయనగరం అసెంబ్లీ నుంచి కూతురు విజయం సాధిస్తే పూసపాటి వారి మూడవ తరం కూడా రాజకీయంగా స్థిరపడుతుందని ఆయన ఆశపడుతున్నారు. అందుకోసమే ఆయన గత పదేళ్ల నుంచి పావులు కదుపుతూ వస్తున్నారు. నిజానికి చూస్తే 2014 వ సంవత్సరంలో అశోక్ కి లోక్ సభకు పోటీ చేయడం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనను పోటAP Elections 2024{#}Vijayanagaram;Vizianagaram;Chiranjeevi;ashok;Ishtam;Backward Classes;raja;geetha;MLA;king;Hanu Raghavapudi;politics;Assembly;CBN;central government;Minister;Partyఉత్తరాంధ్ర: విజయనగరంలో పోటీ రసవత్తరం?ఉత్తరాంధ్ర: విజయనగరంలో పోటీ రసవత్తరం?AP Elections 2024{#}Vijayanagaram;Vizianagaram;Chiranjeevi;ashok;Ishtam;Backward Classes;raja;geetha;MLA;king;Hanu Raghavapudi;politics;Assembly;CBN;central government;Minister;PartyMon, 08 Apr 2024 12:48:52 GMTవిజయనగరం అసెంబ్లీ సీటులో ఈసారి పోటీ చాలా రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తాను రాజకీయంగా పదవీ విరమణ చేసి మరీ కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది.విజయనగరం అసెంబ్లీ నుంచి కూతురు విజయం సాధిస్తే పూసపాటి వారి మూడవ తరం కూడా రాజకీయంగా స్థిరపడుతుందని ఆయన ఆశపడుతున్నారు. అందుకోసమే ఆయన గత పదేళ్ల నుంచి పావులు కదుపుతూ వస్తున్నారు. నిజానికి చూస్తే 2014 వ సంవత్సరంలో అశోక్ కి లోక్ సభకు పోటీ చేయడం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనను పోటీకి పెట్టారు.ఆ టైంలో విజయనగరం అసెంబ్లీ సీటుని మీసాల గీతకు ఇవ్వడం జరిగింది. ఆమె అలా తొలిసారి ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి విజయం సాధించారు. అంతకు ముందు ఆమె 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి చూసారు. ఆ ఎన్నికల్లో ఆమె అశోక్ కి అపోనెంట్ గా ఉన్నారు. ఆ తరువాత ఆమె టీడీపీలో చేరినా అశోక్ కి రాజా వారి బంగ్లాకు  దూరంగా ఉంటూనే రాజకీయాలు చేశారు. మరో వైపు చూస్తే ఆమె 2014 వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమెను పక్కన పెట్టి విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అశోక్ చక్రం తిప్పారని కూడా గీత వర్గం అంటుంది.


ఇక 2019 నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీతను పక్కన పెట్టి తన కూతురుకు అశోక్ టికెట్ ఇప్పించుకున్నారు.అయితే మొదటి ప్రయత్నంలో అదితి గజపతిరాజు ఓటమి పాలయ్యారు. అందుకు కారణం బీసీ మహిళా ఎమ్మెల్యేల్ను పక్కన పెట్టడమే అని అంటారు. 2024 ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ వస్తుందని గీత భావిస్తే మళ్ళీ అశోక్ కూతురు అదితికే టికెట్ ఇచ్చారు. అందువల్ల మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధపడుతున్నారు. ఆమె టీడీపీలో ఉన్నా అశోక్ గజపతి రాజు బంగ్లా రాజకీయాలకు దూరంగానే తనదైన రాజకీయం చేస్తూ వచ్చారు.ప్రస్తుతం తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నారని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటులో చూస్తే దాదాపుగా డెబ్బై వేల పైగా కాపులు ఉన్నారు. వారందరూ బీసీ కాపులు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన గీత తమ సామాజికవర్గం బలం మొత్తం జనాభాలో ఏకంగా నలభై శాతంగా ఉంటే తనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించకపోవడం తో ఆగ్రహం చెందారని అంటున్నారు. ఆ సామాజికవర్గం సపోర్ట్ తో ఆమె ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు.అదే జరిగితే అదితి గజపతిరాజు విజయావకాశాల మీద గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>