PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayachoti-ycp-tdp8e6d9ce1-8b5d-49bc-9057-d2e99c8f953e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayachoti-ycp-tdp8e6d9ce1-8b5d-49bc-9057-d2e99c8f953e-415x250-IndiaHerald.jpgఅన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది.. ఎన్నికలు దగ్గరకు సమీపిస్తున్న నేపథ్యంలో అటు ఇటు రాజకీయ జంపింగ్ లు కూడా జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే రాయచోటి నియోజవర్గంలో కీలకమైన నాయకుడు వైసీపీ పార్టీలోకి చేరడంతో ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది.. రాయచోటి టిడిపి ఇన్చార్జిగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే R. రమేష్ రెడ్డి టిడిపి టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆయనకు భంగపాటు కలిగింది.. రాయచోటి సీటును మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారు.. దీంతో మాజీ ఎమ్RAYACHOTI;YCP;TDP{#}Wife;Gandikota;Rayachoty;Rajampet;CBN;TDP;YCP;srinivas;kadapa;Reddy;MLA;District;Elections;CM;Newsరాయలసీమ (రాయచోటి) : ఆ నేత చేరికతో వైసీపీ జెండా ఎగరడం ఖాయం..!రాయలసీమ (రాయచోటి) : ఆ నేత చేరికతో వైసీపీ జెండా ఎగరడం ఖాయం..!RAYACHOTI;YCP;TDP{#}Wife;Gandikota;Rayachoty;Rajampet;CBN;TDP;YCP;srinivas;kadapa;Reddy;MLA;District;Elections;CM;NewsMon, 08 Apr 2024 06:55:55 GMTఅన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది.. ఎన్నికలు దగ్గరకు సమీపిస్తున్న నేపథ్యంలో అటు ఇటు రాజకీయ జంపింగ్ లు  కూడా జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే రాయచోటి నియోజవర్గంలో కీలకమైన నాయకుడు వైసీపీ పార్టీలోకి చేరడంతో ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది.. రాయచోటి టిడిపి ఇన్చార్జిగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే R. రమేష్ రెడ్డి టిడిపి టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆయనకు భంగపాటు కలిగింది.. రాయచోటి సీటును మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారు..


దీంతో మాజీ ఎమ్మెల్యే అయిన రమేష్ రెడ్డి ఈ విషయంలో కాస్త అసహనాన్ని తెలియజేశారు.. అలా కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఈయన తన కార్యాలయంలో ఉండేటువంటి చంద్రబాబు ఫోటోలు, టిడిపి జెండాలు, ఫ్లెక్సీలను కూడా తొలగించినట్లు తెలుస్తోంది.. చంద్రబాబు తీరు పైన ఆగ్రహాన్ని ఈ విధంగా తెలియజేశారు. దీంతో గత కొన్ని నెలలలోనే సీఎం జగన్ సమక్షంలో వైసిపి లోకి చేరుతారని ప్రచారం కూడా ఎక్కువగా వినిపించింది.. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికలకు ముందే  వైసీపీ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధంగానే ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


అందుకు తగ్గట్టుగానే అక్కడి రాజకీయ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. ఈయనను ఒప్పించారట.. మిధున్ రెడ్డి తో పాటు రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి స్వయంగా రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఈయన ఇష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.. రమేష్ రెడ్డి ఎవరో కాదు కడప జిల్లా టిడిపి పొలిట్ బ్యూరో అధ్యక్షుడు..R. శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రమేష్ రెడ్డికి అన్న అవుతారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి భార్య మాధవి రెడ్డి కూడా కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తోందట.. ఒకటి రెండు రోజులలో సీఎం జగన్ సమక్షంలో రమేష్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాయచోటిలో వైసిపి గెలుపు ఖాయమని.. వైసీపీ జెండా ఎగరడం పక్కా అంటూ అక్కడి నేతలు తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>