Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli2778c6e7-c085-41bd-b6c7-80ef4a4628e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli2778c6e7-c085-41bd-b6c7-80ef4a4628e9-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే అందరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ జట్టు ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా అభిమానుల కలను మాత్రం నెరవేర్చలేకపోయింది. వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ కూడా ఆర్సిబి జట్టులోనే కనిపిస్తూ ఉంటారు. అంతెందుకు ఏకంగా ప్రపంచ క్రికెట్ కి రారాజుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఈ టీంలో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయినా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు K9hli{#}VIRAT KOHLI;Cricket;Royal Challengers;Rajasthanకోహ్లీ సెంచరీపై విమర్శలు.. విరాట్ ఏమన్నాడంటే?కోహ్లీ సెంచరీపై విమర్శలు.. విరాట్ ఏమన్నాడంటే?K9hli{#}VIRAT KOHLI;Cricket;Royal Challengers;RajasthanMon, 08 Apr 2024 10:30:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే అందరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ జట్టు ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా అభిమానుల కలను మాత్రం నెరవేర్చలేకపోయింది. వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ కూడా ఆర్సిబి జట్టులోనే కనిపిస్తూ ఉంటారు. అంతెందుకు ఏకంగా ప్రపంచ క్రికెట్ కి రారాజుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఈ టీంలో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు.


 అయినా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు ఆట తీరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ వరుస ఓటములతో చివరికి అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది బెంగళూరు టీం. అయితే కనీసం ఈ ఏడాది జరిగే ఐపిఎల్ సీషన్లో అయినా టైటిల్ గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు అభిమానులు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇక ఐపీఎల్ 17వ సీజన్లో కూడా బెంగళూరు టీమ్ నిరాశ పరచడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.


 వరుస ఓటమిలతో  బెంగళూరు టీం సతమతమవుతుంది. ఇక ఎప్పటిలాగానే కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కాగా ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేశాడు. అయితే కోహ్లీ సెంచరీ చేశాడు అని మెచ్చుకోకుండా టి20 ఫార్మాట్లో ఎక్కువ బంతులు వృధా చేస్తూ  సెంచరీ చేశాడు అంటూ అందరూ విమర్శలు చేశారు. అయితే ఇదే విషయం గురించి కోహ్లీ స్పందించాడు. వికెట్ కాస్త ఫ్లాట్ గా ఉండడంతో చివరి వరకు ఆడాలని భావించాను  పరిస్థితులకు అనుగుణంగా పరిణితితో ఉన్నాను. ఇక్కడ ఎక్కువ రన్స్ రాబట్టలేం. ముఖ్యంగా చాహల్, అశ్విన్ బౌలింగ్ లో నేను రన్స్ చేయలేకపోయా. ఈ పిచ్ పై 183 టార్గెట్ అన్నది బెటర్ అనిపించింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>