MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆముగ్గురు హీరోల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆముగ్గురు మారెవ్వరో కాదు సిద్దూ జొన్నలగడ్డ అడవి శేషు విశ్వక్ సేన్ ఈముగ్గురు నటించే సినిమాల విషయంలో కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా తామే సొంతంగా కథలు వ్రాసుకుంటూ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడ దగ్గర ఉండి వ్రాయిస్తూ ఇంకా అవసరం అనుకుంటే దర్శకుడి స్థానంలోకి వెళ్ళిపోయి తామే మెగా ఫోన్ పట్టుకుని తమ సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్స్ దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాప్స్ విభాగాలలో తమ ప్రావీణ్యాన్ని చూపెడుతూ తాము నTOLLYWOOD{#}bhaskar;sithara;Godavari River;Baba Bhaskar;Smart phone;Viswak sen;Athadu;Hero;Vaishno Devi;Dargah Sharif;Newsఆముగ్గురు హీరోల మ్యానియాలో ఇండస్ట్రీ !ఆముగ్గురు హీరోల మ్యానియాలో ఇండస్ట్రీ !TOLLYWOOD{#}bhaskar;sithara;Godavari River;Baba Bhaskar;Smart phone;Viswak sen;Athadu;Hero;Vaishno Devi;Dargah Sharif;NewsMon, 08 Apr 2024 09:00:00 GMTప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆముగ్గురు హీరోల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆముగ్గురు మారెవ్వరో కాదు సిద్దూ జొన్నలగడ్డ అడవి శేషు విశ్వక్ సేన్ ఈముగ్గురు నటించే సినిమాల విషయంలో కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా తామే సొంతంగా కథలు వ్రాసుకుంటూ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడ దగ్గర ఉండి వ్రాయిస్తూ ఇంకా అవసరం అనుకుంటే దర్శకుడి స్థానంలోకి వెళ్ళిపోయి తామే మెగా ఫోన్ పట్టుకుని తమ సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్స్ దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాప్స్ విభాగాలలో తమ ప్రావీణ్యాన్ని చూపెడుతూ తాము నటించే సినిమాల సూపర్ హిట్ లు సహకరిస్తున్న ఈముగ్గురు హీరోలు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రిగా మారారు.



వీరితో సినిమాలు తీసిన నిర్మాతలకు ఒకటికి రెండింతలు లాభాలు వచ్చిపడుతూ ఉండటంతో చాలామంది నిర్మాతలు వీరితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు అంటు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు వీరికి ఎవ్వరికీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. కేవలం మధ్య తరగతి నేపధ్యం నుండి వచ్చిన వారు ఈముగ్గురు. వీరు ముగ్గురు కూడ ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు అవ్వడం మరొక కొసమెరుపు.



ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రిగా మారిన సిద్దూ జొన్నలగడ్డ తో ‘టిల్లు’ మూవీలు తీస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కు ఈహీరో అదృష్టంగా మారడంతో ‘టిల్లు 3’ తీయడానికి ఈనిర్మాత ఏకంగా 20కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈక్రేజీ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ కొంచం క్రాక్’ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదేవిధంగా అడవి శేషు ప్రస్తుతం నటిస్తున్న ‘గూఢచారి 2’ ‘డెకాయిట్’ సినిమాలలో నటిస్తూ ఆసినిమాల స్క్రిప్ట్ విషయమై కూడ చాల శ్రద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇక ఇదే రూట్ లో మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా అతడు నటించిన ‘గామి’ సినిమాకు మంచి ప్రశంసలు లభించడంతో త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ వస్తున్నాడు. అతడు నటిస్తున్న ‘లైలా’ మూవీలో ఈ యంగ్ హీరో లేడీ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. త్వరలోనే ఈముగ్గురు దర్శకులుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు..  


 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>