PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-uravakonda-tdp-ycpac617ca7-f15a-488f-9a9d-2a5141166807-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-uravakonda-tdp-ycpac617ca7-f15a-488f-9a9d-2a5141166807-415x250-IndiaHerald.jpg•తెరపైకి ఉరవకొండ సెంటిమెంట్ •టీడీపీ గెలిస్తే అధికారంలోకి వైసీపీ •వైసీపీ గెలిస్తే అధికారంలోకి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సెంటిమెంట్ రాజకీయాలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఉరవకొండ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం కన్నా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతారనే విషయం పైన ఎక్కువగా ఆసక్తి నెలకొంది.. ఎందుకంటే ఈ నియోజకవర్గ గెలుపోటములు పైనే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనRAYALASIMA;URAVAKONDA;TDP;YCP{#}PAYYAVULA KESHAV;Kanna Lakshminarayana;Rayalaseema;Uravakonda;politics;Assembly;Reddy;Congress;Yevaru;Elections;India;Hanu Raghavapudi;Party;Telugu Desam Party;YCP;TDPరాయలసీమ (ఉరవకొండ): సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?రాయలసీమ (ఉరవకొండ): సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?RAYALASIMA;URAVAKONDA;TDP;YCP{#}PAYYAVULA KESHAV;Kanna Lakshminarayana;Rayalaseema;Uravakonda;politics;Assembly;Reddy;Congress;Yevaru;Elections;India;Hanu Raghavapudi;Party;Telugu Desam Party;YCP;TDPMon, 08 Apr 2024 12:00:00 GMT•తెరపైకి ఉరవకొండ సెంటిమెంట్
•టీడీపీ గెలిస్తే అధికారంలోకి వైసీపీ
•వైసీపీ గెలిస్తే అధికారంలోకి టీడీపీ

(రాయలసీమ- ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సెంటిమెంట్ రాజకీయాలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఉరవకొండ సెంటిమెంట్  తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం కన్నా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతారనే విషయం పైన ఎక్కువగా ఆసక్తి నెలకొంది.. ఎందుకంటే ఈ నియోజకవర్గ గెలుపోటములు పైనే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందననే విషయం అంచనా వేయవచ్చు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు..


సాధారణంగా ఏదైనా ఫలానా  నియోజవర్గంలో గెలిస్తే  ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం ఆ సెంటిమెంటు రివర్స్ గా ఉంటుంది. ఉరవకొండలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందనే సెంటిమెంట్ నడుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిన పార్టీనే అధికారంలోకి వస్తుందట. ఇది వినడానికి చెప్పడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజమని పలువురు సీనియర్ నాయకులు,  నేతలు కూడా తెలుపుతున్నారు. కానీ గత ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఇది నిజమే అనిపిస్తుంది..


1999 నుంచి ఉరవకొండలో ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. 1999లో ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.2004, 2009 లో ఉరవకొండలో టిడిపి పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ గెలవగా.. రెండుసార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి వై విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందగా టిడిపి ప్రభుత్వం ఏర్పడింది.. 2019 ఎన్నికల్లో నాలుగవ సారి పయ్యావులు గెలుపొందగా వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఉరవకొండలో ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉన్నది.. 2019లో రాయలసీమ మొత్తం వైసీపీ పార్టీ బలంగా ఉండగా అక్కడ టిడిపి పార్టీ గెలిచింది. దీంతో రాష్ట్రంలో టిడిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. అందుకే 2024లో ఉరవకొండలో ఎవరు గెలుస్తారని విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎప్పటిలాగే ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.. లేదంటే ఆ సెంటిమెంట్ ను  ఎవరైనా మారుస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>