PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-matrula-joythishma-falinchenaa6843be7f-cc4a-49c6-9e94-61512ef3e641-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-matrula-joythishma-falinchenaa6843be7f-cc4a-49c6-9e94-61512ef3e641-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లోని రాజకీయం ఇప్పుడు ఎలా ఉందంటే ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి తమ వైపు ముగ్గు ఉందని తెలియజేస్తూ ఉన్నారు.. ఇప్పుడు ఆంధ్రాలో వైయస్ జగన్ అయితే వై నాట్ 200 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. అలాగే బస్సు యాత్రలో భాగంగా రకరకాల ప్రాంతాలలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ప్రస్తుతం ప్రకాశం జిల్లా దాకా వచ్చినట్టుగా తెలుస్తోంది. జూన్లో తాను మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అనే విధంగా తెలియజేస్తున్నారు.. ఆయన ధీమా చూస్తూ ఉంటే వైసిపి మంత్రులు కూడా ఇదే మాటని తెలియజేస్తున్నారు. ఉత్తరాంధYCP;LEADERS;TALK;{#}DHARMANA PRASADA RAO;BOTCHA SATYANARAYANA;Srikakulam;Uttarandhra;Akkineni Nageswara Rao;Godavari River;June;Koshta;Prakasam;Guntur;Vijayanagaram;Vizianagaram;bus;CBN;Reddy;Jagan;YCP;Party;CM;Government;Ministerఏపీ: మంత్రుల జ్యోతిష్యం ఫలించేనా..?ఏపీ: మంత్రుల జ్యోతిష్యం ఫలించేనా..?YCP;LEADERS;TALK;{#}DHARMANA PRASADA RAO;BOTCHA SATYANARAYANA;Srikakulam;Uttarandhra;Akkineni Nageswara Rao;Godavari River;June;Koshta;Prakasam;Guntur;Vijayanagaram;Vizianagaram;bus;CBN;Reddy;Jagan;YCP;Party;CM;Government;MinisterMon, 08 Apr 2024 14:12:19 GMTఆంధ్రప్రదేశ్ లోని రాజకీయం ఇప్పుడు ఎలా ఉందంటే ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి తమ వైపు ముగ్గు ఉందని తెలియజేస్తూ ఉన్నారు.. ఇప్పుడు ఆంధ్రాలో వైయస్ జగన్ అయితే వై నాట్ 200 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. అలాగే బస్సు యాత్రలో భాగంగా రకరకాల ప్రాంతాలలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ప్రస్తుతం ప్రకాశం జిల్లా దాకా వచ్చినట్టుగా తెలుస్తోంది. జూన్లో తాను మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అనే విధంగా తెలియజేస్తున్నారు.. ఆయన ధీమా చూస్తూ ఉంటే వైసిపి మంత్రులు కూడా ఇదే మాటని తెలియజేస్తున్నారు.


ఉత్తరాంధ్ర నుంచి గోదావరి వరకు.. అలాగే కోస్తా జిల్లాల మంత్రులు కూడా ఈ విషయాలను ఒప్పుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంత్రి అంబాటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం తాము నెరవేర్చామని జూన్ 4న ఫలితాలు వస్తాయని.. అందులో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం కూడా ఖాయమని తెలియజేస్తున్నారు అంబటి రాంబాబు. కచ్చితంగా తాను సత్తెనపల్లిలో మంచి మెజారిటీతోనే గెలుస్తానంటూ వెల్లడించారు.


తనమీద నిలబడేందుకు అభ్యర్థి లేక.. చంద్రబాబును ఎన్నో మాటలు అన్నారని అవన్నీ మరచి బాబు పక్కన పెట్టి మళ్ళీ తన మీద లక్ష్మీనారాయణను తెచ్చి పోటీకి పెట్టారని.. అక్కడ తనను గెలిపించండి అని కోరడం చాలా విడ్డూరంగా ఉందని మాట్లాడారు. విజయనగరం జిల్లా విషయానికి వస్తే.. బొత్స సత్యనారాయణ.. మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని దేశంలో ఎన్ని రకాలైన సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే అంటూ తెలిపారు. కూటమిలో కొత్త కుట్రలు కూడా పురుడు పోసుకుంటున్నాయని బొత్స తెలియజేశారు.


అలాగే అమలాపురం జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ కూడా ఈసారి అధికారంలో వైసీపీ పార్టీనే వస్తుందంటూ వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలే తనకు అండగా నిలబడతాయని ధైర్యంగా చెప్పగలుగుతున్నామని తెలిపారు. పల్లెలలో పట్టణాలలో వ్యత్యాసం లేకుండా అన్నిచోట్ల కూడా వైసిపి పాలనకు మద్దతు కనిపిస్తోందని విశ్వరూప్ వెల్లడించారు. ఈ విషయాన్ని మరొక నేత కారుమూరు నాగేశ్వరరావు కూడా తెలియజేశారు. గోదావరి జిల్లాలో వైసీపీకి ఎదురులేదని వెల్లడించారు. శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదని వెల్లడించారు.. కచ్చితంగా ఈసారి సీఎం జగన్ అవుతారని తెలుపుతున్నారు. ఇలా నేతలంతా ఈసారి పార్టీ వైసీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతోపాటు జగన్ కూడా ఇదే ధీమాతో ఉన్నారు.. ముఖ్యంగా కూటానికి భయపడే ప్రసక్తి లేదని వైసిపి నాయకులు చెబుతున్నారు. మరి ఈ మంత్రులు చెప్పిన మాటలు ఫలిస్తాయో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>