PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan03532855-6b7d-4ea0-a84c-f36b2b18f227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan03532855-6b7d-4ea0-a84c-f36b2b18f227-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొలదీ కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనే అంశం మీద పలు చర్చలు నడుస్తున్నాయి. తాజా పరిణామం ఏమిటంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విషయం ఏమిటంటే, తాజాగా ఆమె ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఇక మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవి రెడ్డి శివ శంjagan{#}Sanjeev;uday kumar;Police Station;Supreme Court;bhaskar;Baba Bhaskar;Y S Vivekananda Reddy;sunil;monday;High court;Telangana;kadapa;Shiva;lord siva;shankar;Murder.;Minister;Reddy;devineni avinash;Fatherఏపీ: వివేకానంద రెడ్డి హత్యకేసులో ఊహించని మలుపు, ఇక శిక్ష తప్పదా?ఏపీ: వివేకానంద రెడ్డి హత్యకేసులో ఊహించని మలుపు, ఇక శిక్ష తప్పదా?jagan{#}Sanjeev;uday kumar;Police Station;Supreme Court;bhaskar;Baba Bhaskar;Y S Vivekananda Reddy;sunil;monday;High court;Telangana;kadapa;Shiva;lord siva;shankar;Murder.;Minister;Reddy;devineni avinash;FatherMon, 08 Apr 2024 18:00:00 GMTఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొలదీ కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనే అంశం మీద పలు చర్చలు నడుస్తున్నాయి. తాజా పరిణామం ఏమిటంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విషయం ఏమిటంటే, తాజాగా ఆమె ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఇక మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని, అదేవిధంగా ప్రతి సోమవారం సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని, ఇక ఏపీలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించ కూడదని షరతు విధించింది. దీంతో పాటు దేవిరెడ్డి సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో బయటకు వచ్చిన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి విషయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఆయనికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం నేడు విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే శివ శంకర్ రెడ్డితో పాటుగా ప్రతి వాదులు అందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, యర్రా గంగిరెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత అలుపెరగని న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి హత్యకేసు నిందితుడైన కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించాలని ఆమె ప్రార్థిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>