PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-618ddc46-07b6-4b7b-af47-ef5fc9e2c5bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-618ddc46-07b6-4b7b-af47-ef5fc9e2c5bd-415x250-IndiaHerald.jpg• టీడీపీ పరిస్థితి అయోమయం • అభ్యర్థులు మార్పులతో గందరగోళం • ఎన్నికలు దగ్గర పడుతున్నా నో క్లారిటీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభర్ధులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో బాగా ప్రచారం చేయిస్తోంది.అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్TDP{#}REDDY SHANTHI,Tiruvuru,Telugu Desam Party,Elections,Y. S. Rajasekhara Reddy,YCP,India,News,CBN,TDPటీడీపీ పరిస్థితి తార్ మార్ తక్కర్ మార్?టీడీపీ పరిస్థితి తార్ మార్ తక్కర్ మార్?TDP{#}REDDY SHANTHI,Tiruvuru,Telugu Desam Party,Elections,Y. S. Rajasekhara Reddy,YCP,India,News,CBN,TDPMon, 08 Apr 2024 10:42:00 GMTటీడీపీ పరిస్థితి అయోమయం
•  అభ్యర్థుల మార్పులతో గందరగోళం
•  ఎన్నికలు దగ్గర పడుతున్నా నో క్లారిటీ


ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభర్ధులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో బాగా ప్రచారం చేయిస్తోంది.అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్లను మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టిక్కెట్ ప్రకటించగా అయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో మళ్లీ రఘురామకృష్ణం రాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతే కాకుండా జగపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా అయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్యను ఓడించడం శ్రీనివాస్‌కు అసాధ్యమని భావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట.


ఇంకా అలాగే టీవీల్లో అడ్డం దిడ్డం మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్‌కు కూడా తిరువూరు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. అయితే టీవీల్లో వాగడం వేరు.. జనాల్లో తిరగడం వేరని పార్టీకి ఇప్పటికే స్పష్టంగా అర్థం అయిందని, దీంతో ఆయన్ను పక్కన బెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని సమాచారం తెలుస్తుంది. పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించడం జరిగింది. ఈ నెల రోజుల తరువాత ఇక ఆయన సరిపోవడం లేదని తేలిందట.. దీంతో రెండో అభ్యర్థి వస్తున్నట్లు రూమర్లున్నాయి. శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల రెండు.. మూడో అభ్యర్థి రాబోతున్నట్లు క్యాడర్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల దాకా బీ ఫారం వచ్చే దాకా ఎవరూ కూడా శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ పని చేస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే చాలా కష్టం అంటున్నారు.మరి చూడాలి అభ్యర్థులు విషయంలో టీడీపీకి గందరగోళ పరిస్థితిని సరి చేసుకుంటుందో లేదో..




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>