PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-is-needed-now-not-in-the-janasena-change-within-the-janasena1ad9059f-4059-4d2b-abf4-4c3c9bf304d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-is-needed-now-not-in-the-janasena-change-within-the-janasena1ad9059f-4059-4d2b-abf4-4c3c9bf304d5-415x250-IndiaHerald.jpgఒక పార్టీ అధినేత‌గా.. ప‌దేళ్ల పాటు పార్టీని న‌డిపించాన‌ని.. అనేక క‌ష్టాలు ఎదుర్కొంటున్నాన‌ని ప‌దే ప‌దే చెప్పే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సింది ఏంటి? చేస్తున్న‌ది ఏంటి? అనేది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ప‌వ‌న్ వ్య‌క్తిగతంగా మంచి నాయ‌కుడే కావొచ్చు. కానీ, రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చేస రికి శీల‌ప‌రీక్ష‌కు నిల‌బడాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో న‌న్ను ఎవ‌రూ ప్ర‌శ్నించొద్దు.. అంటే కుద‌రే ప‌నికాదు. అలా అనుకుంటే.. అన్న‌య్య‌లా చేసే స‌రిపోతుంది. అప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌రు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ చేయాల్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena{#}AdiNarayanaReddy;Partyఇప్పుడు కావాల్సింది.. జ‌న‌సేన‌లో కాదు.. జ‌న‌సేనానిలోనే మార్పే...?ఇప్పుడు కావాల్సింది.. జ‌న‌సేన‌లో కాదు.. జ‌న‌సేనానిలోనే మార్పే...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena{#}AdiNarayanaReddy;PartyMon, 08 Apr 2024 17:01:08 GMTఒక పార్టీ అధినేత‌గా.. ప‌దేళ్ల పాటు పార్టీని న‌డిపించాన‌ని.. అనేక క‌ష్టాలు ఎదుర్కొంటున్నాన‌ని ప‌దే ప‌దే చెప్పే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సింది ఏంటి?  చేస్తున్న‌ది ఏంటి? అనేది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ప‌వ‌న్ వ్య‌క్తిగతంగా మంచి నాయ‌కుడే కావొచ్చు. కానీ, రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చేస రికి శీల‌ప‌రీక్ష‌కు నిల‌బడాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో న‌న్ను ఎవ‌రూ ప్ర‌శ్నించొద్దు.. అంటే కుద‌రే ప‌నికాదు. అలా అనుకుంటే.. అన్న‌య్య‌లా చేసే స‌రిపోతుంది. అప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌రు.

ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ చేయాల్సింది.. ఆది నుంచి అంద‌రూ చెబుతున్న‌ట్టుగా.. పార్టీని కాదు.. పార్టీ నాయ‌కు ల‌ను ముందుండి న‌డిపించాలి. ఏ వీక్‌నెస్ అయితే.. ఉండి.. పార్టీ నాయ‌కులు అల్లాడిపోతున్నారో.. ఆ వీక్నెస్‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కేవ‌లం ఓ ల‌క్ష‌మంది వ‌చ్చేసి ఈల‌లు కొడితే.. అదే బ‌లం అనుకునే వీక్ నెస్‌ను ప‌క్క‌న పెట్టి.. క్షేత్ర‌స్థాయి వాస్తవాల‌ను ప‌వ‌న్ గ్ర‌హించాలి. త‌నకు చేరువ అవుతుంద‌ని.. చేరువ అయింద‌ని చెప్పుకొనే.. కాపు సామాజిక వ‌ర్గం నిజంగానే చేరువ‌గా ఉందా? అని ప్ర‌శ్నించుకోవాలి.

ఎప్పుడైతే.. భీమ‌వ‌రంలో త‌ప్పు జ‌రిగిందో.. అప్పుడే.. కాపు వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఇది నిష్ఠుర స‌త్యం. ఈ విష‌యం ప‌వ‌న్‌కు కూడా తెలుసు. అయినా.. ఆయ‌న తెలియ‌న‌ట్టు ఎవ‌రి కోసం న‌టిస్తున్నారో.. ఆయ‌న‌కే తెలియాలి. ఇక‌, ఉన్న పార్టీ నేత‌ల‌కు టికెట్లు చాలవ‌ని.. ఎంతో మంది పార్టీ కోసం ప‌నిచేశార‌ని చెప్పుకొన్న ప‌రిస్థితి నుంచి తీసుకున్న 21 సీట్ల‌ను కూడా వేరే వారికి ఇచ్చి.. చేసింది ఏంటి? అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చేయాల్సింది.. ఎన్నిక‌ల కంటే కూడా.. పార్టీ కోసం ప‌నిచేయ‌డం. ఇది ముమ్మాటికీ వాస్త‌వం.

ఎలాగూ అధికారాన్ని వ‌దిలేసుకున్న ద‌రిమిలా.. ఇప్పుడు.. పార్టీనైనా నిల‌బెట్టుకునే ప‌రిస్థితి ఉందా? అనేది ప్ర‌శ్న‌. అన‌కాప‌ల్లిలో స‌భ పెడితే.. పార్టీ నాయ‌కులు ఎంత మంది వచ్చార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. ఒక‌ప్పుడు.. ఇదే జ‌న‌సేన‌పై నోరు చేసుకున్న కొణ‌తాల‌కు టికెట్ ఇవ్వ‌డం ఎంత‌మంది హ‌ర్షించా రు?  స‌రే.. ఇప్ప‌టికి అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది.. జ‌న‌సేన‌లో మార్పు కాదు.. జ‌న‌సేనానిలోనే మార్పు. ఈ దిశ‌గా అడుగులు వేయ‌క‌పోతే.. పోతిన మ‌హేష్ ఆవేశంతో అన్నాడో.. ఆలోచించే అన్నాడో.. `ప్ర‌జారాజ్యం-2`గా మార‌డం ఖాయ‌మే అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>