PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-jagan-avinashebf57a6e-0e20-405d-9491-25f3b155b48f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-jagan-avinashebf57a6e-0e20-405d-9491-25f3b155b48f-415x250-IndiaHerald.jpgదివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా ఉన్నారు.. ఇటీవలే వైయస్ కుటుంబంలో కూడా పలు రకాల చీలికలు ఏర్పడ్డాయి.. అలా రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులు వేసి ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు అందుకుంది.. దీంతో తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన పలు రకాల విమర్శలు చేస్తూనే ఉంది.. రాజశేఖర్ రెడ్డి కి సీఎం జగన్ అసలు వారసుడే కాదని విమర్శిస్తుంది. బస్సు యాత్రలో భాగంగా వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో మాట్లాడడం జరిగింది షర్మిల..SHARMILA;JAGAN;AVINASH{#}sunita singer;CBI;dr rajasekhar;Murder.;Yevaru;District;Minister;bus;Reddy;MP;devineni avinash;Sharmila;Congress;Athadu;CM;Andhra Pradesh;Jagan;Fatherవై. ఎస్. షర్మిల: అవినాష్ ను కాపాడుతున్నది జగనే.. ఆధారాలున్నా..?వై. ఎస్. షర్మిల: అవినాష్ ను కాపాడుతున్నది జగనే.. ఆధారాలున్నా..?SHARMILA;JAGAN;AVINASH{#}sunita singer;CBI;dr rajasekhar;Murder.;Yevaru;District;Minister;bus;Reddy;MP;devineni avinash;Sharmila;Congress;Athadu;CM;Andhra Pradesh;Jagan;FatherMon, 08 Apr 2024 15:36:54 GMTదివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా ఉన్నారు.. ఇటీవలే వైయస్ కుటుంబంలో కూడా పలు రకాల చీలికలు ఏర్పడ్డాయి.. అలా రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులు వేసి ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు అందుకుంది.. దీంతో తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన పలు రకాల విమర్శలు చేస్తూనే ఉంది.. రాజశేఖర్ రెడ్డి కి సీఎం జగన్ అసలు వారసుడే కాదని విమర్శిస్తుంది.


బస్సు యాత్రలో భాగంగా వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో మాట్లాడడం జరిగింది షర్మిల.. వైయస్ పాలనతో జగన్ పాలనకు అసలు పొంతన ఉండదని భూతద్దం పెట్టి చూసినా  కూడా అలాంటి ఆనవాళ్లు కనిపించవని తెలిపింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ తేల్చి చెప్పిందని..కాల్ రికార్డులు ,గూగుల్ మ్యాప్స్,  లావాదేవీలు ఉన్నట్లు తెలియజేసింది .ఇలా అన్ని ఆధారాలు ఉన్నా జగన్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని ఆమె ఆగ్రహాన్ని తెలియజేసింది.

జగన్ పాలనలో రైతులు చాలా నష్టపోయారని.. ధరల స్థిరీకరణ కూడా లేదని.. రైతులను జగన్ మోసం చేశారని తెలుపుతోంది షర్మిల.. వైయస్సార్ హయాంలో రైతే రాజుగా ఉండే వారని కానీ ఇప్పుడు రైతు పాలిట అప్పులు శాపంగా మారాయని.. డ్రిప్ వేసుకోవడానికి అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారని , సంపూర్ణ మద్యపానం నిషేధం అంటూ హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వమే వాటిని విక్రయిస్తోంది అంటూ ఎద్దేవా చేసింది..2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్ , మెగా డీఎస్సీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేశారని వెల్లడిస్తోంది ..జగన్ ది హత్య రాజకీయాలు చేసే పాలన అని,  సొంత బాబాయిని చంపిన నిందితుడిని కాపాడుతున్నారని జగన్ పైన ఫైర్ అయ్యింది.. అలాగే నిందితుడు అవినాష్ కి మళ్ళీ టికెట్ ఇవ్వడం అతడు చట్ట సభలోకి వెళ్ళకూడదు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి అంటూ కోరింది. హంతకుడి వైపా న్యాయం కోసం పోరాడే వ్యక్తి వైపా అంటూ షర్మిల తెలియజేస్తోంది.


షర్మిల తో పాటూ బస్సు యాత్రలో పాల్గొన్న వివేక కుమార్తె సునీత ఆడది అంటే నారీశక్తి అని , తమను కూడా అలాగే పెంచారని.. తప్పు చేస్తే ఎవరినైనా తప్పు అని చెప్పే మనస్తత్వం మాది అని,  వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు.. న్యాయం కోసం పోరాడుతున్నాము.. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు.. షర్మిలను ఎంపీగా చూడాలన్నదే తన తండ్రి కోరిక అంటూ సునిత వెల్లడించింది. అందుకే అందరూ ఆశీర్వదించాలంటూ  కోరుకుంటోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>