Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhaansharma508387ee-c6f7-4bad-a1bd-8e9cebdafed1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhaansharma508387ee-c6f7-4bad-a1bd-8e9cebdafed1-415x250-IndiaHerald.jpgక్యూట్ హీరోయిన్ ఆదాశర్మ గత కొంతకాలం నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఆమె నటించిన కేరళ స్టోరీ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టాలీవుడ్ లో హార్ట్ ఎటాక్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన తగిన గుర్తింపు రాలేదు. దీంతో ఇక టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ పై కన్నAdhaansharma{#}Adah Sharma;Sushant Singh;sushanth;Kerala;Tollywood;Cheque;Heroine;Heart Attack;bollywood;Newsఅది ఫేక్ న్యూస్.. అస్సలు నమ్మకండి : ఆదాశర్మఅది ఫేక్ న్యూస్.. అస్సలు నమ్మకండి : ఆదాశర్మAdhaansharma{#}Adah Sharma;Sushant Singh;sushanth;Kerala;Tollywood;Cheque;Heroine;Heart Attack;bollywood;NewsMon, 08 Apr 2024 09:00:00 GMTక్యూట్ హీరోయిన్ ఆదాశర్మ గత కొంతకాలం నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఆమె నటించిన కేరళ స్టోరీ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే టాలీవుడ్ లో హార్ట్ ఎటాక్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన తగిన గుర్తింపు రాలేదు. దీంతో ఇక టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.


 అయితే టాలీవుడ్ తో పోల్చి చూస్తే బాలీవుడ్లో ఈ అమ్మడికి మంచి అవకాశాలే దక్కాయి. ఇక కొన్ని వివాదాస్పద సినిమాల్లో కూడా నటిస్తూ ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. ఆదాశర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఫ్లాట్ ను ఏకంగా హీరోయిన్ ఆదాశర్మ కొనుగోలు చేసింది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్నో భవనాలు ఉండగా ఆదాశర్మ ఎందుకు ఇదే ప్లాట్ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ కొనుక్కోలు వెనుక ఏదైనా కారణం ఉందా అనేది కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.


 అయితే ఇటీవల ఈ విషయంపై స్వయంగా హీరోయిన్ ఆదాశర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని తాను కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవం అంటూ ఆదాశర్మ ఖండించింది. నేను ఆయన ఇంటిని కొనలేదు. కేవలం చూడటానికి మాత్రమే అక్కడికి వెళ్లాను. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రస్తుతం నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్న. ఇక ఇందుకోసం అద్ద చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ ఒక పోస్ట్ పెట్టింది ఆదాశర్మ. ఇక ఈ పోస్ట్ తో ఆమెపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది అని చెప్పాలి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>