Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaa029f79-0d36-489b-bc18-865da9f2aafc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpaa029f79-0d36-489b-bc18-865da9f2aafc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలు గెలుపే కూడా లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు మధ్య త్రిముక పోరు ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయ్. అయితే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బిBjp{#}Kumaar;Backward Classes;Parliment;Reddy;Parliament;Yevaru;Congress;Bharatiya Janata Party;Party;Telanganaచేవెళ్ల : చూస్తూ ఉండండి.. 3 లక్షల మెజారిటీతో గెలుస్తా?చేవెళ్ల : చూస్తూ ఉండండి.. 3 లక్షల మెజారిటీతో గెలుస్తా?Bjp{#}Kumaar;Backward Classes;Parliment;Reddy;Parliament;Yevaru;Congress;Bharatiya Janata Party;Party;TelanganaMon, 08 Apr 2024 19:30:00 GMTప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలు గెలుపే కూడా లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు మధ్య త్రిముక పోరు ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయ్. అయితే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు అయినా కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు.


 అయితే కాసాని జ్ఞానేశ్వర్ మినహా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన వారరే. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో రంజిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలోనె ఇప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ప్రస్తుతం ఆశక్తికరంగా మారిపోయింది. కాగా ఈసారి చేవెళ్లలో బిజెపికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కాగా తన గెలుపు అవకాశాలపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి.


 ఇటీవలే జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మోడీ మేనియా కొనసాగుతుంది అంటూ చెప్పుకోచ్చారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ మేనియా మరింత ఎక్కువగా ఉంది అంటూ తెలిపారు. ఇక్కడ ఏ అభ్యర్థిని బిజెపి తరఫున పోటీకి నిలబెట్టిన లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని.. కానీ తనకు లక్ష మెజారిటీ సరిపోదని అందుకే  మూడు లక్షల మెజారిటీ తెచ్చుకుంటాను అంటూ శపథం చేశారు. చేవెళ్ల నుంచి తప్పకుండా 3 లక్షల పైచిలుక ఓట్ల మెజారిటీతో విజయం సాధించి చూపిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>