PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh454c37b9-d61f-4afe-8ad0-76da232396e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh454c37b9-d61f-4afe-8ad0-76da232396e6-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా రెండున్నర లక్షల కుటుంబాల ఓట్లు ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ ఎన్నికల్లో సునాయాసంగా అనుకూల ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అయితే వాలంటీర్ల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్రలపై ఏపీ ఓటర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. nimmagadda ramesh kumar {#}Kumaar;Election Commission;Letter;రాజీనామా;Andhra Pradesh;Party;TDP;CBNఏపీ : వాలంటీర్లపై మరో కుట్ర.. నిమగడ్డ ఇది నీకు తగునా?ఏపీ : వాలంటీర్లపై మరో కుట్ర.. నిమగడ్డ ఇది నీకు తగునా?nimmagadda ramesh kumar {#}Kumaar;Election Commission;Letter;రాజీనామా;Andhra Pradesh;Party;TDP;CBNMon, 08 Apr 2024 10:05:00 GMT2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా రెండున్నర లక్షల కుటుంబాల ఓట్లు ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ ఎన్నికల్లో సునాయాసంగా అనుకూల ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అయితే వాలంటీర్ల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్రలపై ఏపీ ఓటర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
వాలంటీర్ల చేత పింఛను పంపిణీ చేయించకూడదని నిమ్మగడ్డ ఈసీకి రాసిన లేఖ వల్ల రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చంద్రబాబుకు మేలు చేయాలని నిమ్మగడ్డ చేసిన ఈ పని వల్ల టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో దాదాపుగా 33 మంది వృద్ధులు చనిపోవడానికి పరోక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ కారణమని చెప్పవచ్చు.
 
వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసే ఛాన్స్ లేకపోవడంతో రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ బూత్ లలో ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవడానికి అనుమతి ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఈసీకి మరో లేఖ రాశారు. నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వాలంటీరు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల ఏజెంట్ గా పని చేయాలో లేదో ఆ వ్యక్తి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ విషయంలో ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వాలంటీర్లను పదేపదే టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ టీడీపీకి చేటు చేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు జాగ్రత్త పడకపోతే మాత్రం టీడీపీకి కొత్త కష్టాలు మొదలైనట్లేనని చెప్పవచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>