EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr269b4b75-4f0e-40ce-add7-08f2977ef4ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr269b4b75-4f0e-40ce-add7-08f2977ef4ad-415x250-IndiaHerald.jpgదెబ్బ మీద దెబ్బ. అవరోధం మీద అవరోధం. ఒకదాని వల్ల పడుతున్న ఇబ్బంది సరిపోవడం లేదంటే.. మరో ఇబ్బంది ఎదురుగా వస్తోంది. దాని నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా మరో ఇబ్మంది. ఇలా వరుస ఇబ్బందులతో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కలత చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ కుదేలవుతోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. నమ్ముకున్న సీనియర్ నేతలు సైతం హ్యాండ్ ఇవ్వడం వంటి వాటిని గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.kcr{#}Anurag Thakur;central government;Elections;Bharatiya Janata Party;CBI;Party;Assembly;KCR;Congress;Smart phoneట్యాపింగ్‌: కేసీఆర్‌కు ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌?ట్యాపింగ్‌: కేసీఆర్‌కు ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌?kcr{#}Anurag Thakur;central government;Elections;Bharatiya Janata Party;CBI;Party;Assembly;KCR;Congress;Smart phoneMon, 08 Apr 2024 13:00:00 GMTదెబ్బ మీద దెబ్బ. అవరోధం మీద అవరోధం. ఒకదాని వల్ల పడుతున్న ఇబ్బంది సరిపోవడం లేదంటే.. మరో ఇబ్బంది ఎదురుగా వస్తోంది. దాని నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా మరో ఇబ్మంది. ఇలా వరుస ఇబ్బందులతో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కలత చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ కుదేలవుతోంది.


ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. నమ్ముకున్న సీనియర్ నేతలు సైతం హ్యాండ్ ఇవ్వడం వంటి వాటిని గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తీవ్ర చర్చనీయాంశం అయింది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ వర్గాల్లో ఈ వార్త ప్రకంపనలు లేపుతోంది.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆషామాషీ వ్యవహారం కాదని.. నిపుణులు.. మేథావులు రాజనీతిజ్ఙులు అంచనా వేస్తున్నారు. నాలుగు నెలల క్రితం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పలువురి రాజకీయ ముఖ్య నేతల ఫోన్ ట్యాప్ చేసి వారి కదలికలను గమనిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి చేరవేశారు. ప్రతిపక్ష నేతల వ్యూహ, వ్యవహారంపై ఒక కన్నేసి ఉంచడం.. వారి ఫోన్ మాటలను రహస్యంగా వినడం ఇప్పుడు దుమారం రేపుతోంది.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని.. లేకుంటే టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.  లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దీనిపై పూర్తిగా దృష్టి సారించి ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ వీటన్నింటిని గులాబీ బాస్ ఎలా తట్టుకుంటారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>