EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap-elections-202043b2bcc55-3ac5-4c6b-9bb4-41778870c9fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap-elections-202043b2bcc55-3ac5-4c6b-9bb4-41778870c9fb-415x250-IndiaHerald.jpgఏపీలో మూడు పార్టీలు కూటమి కట్టాయి. అందులో పెద్ద పార్టీ పెద్దన్న పార్టీ టీడీపీ. దానికి అధినాయకుడు చంద్రబాబు. 40 ఇయర్స్ ఇండస్ర్టీ. ఆయన స్వయంగా చెప్పుకుంటున్నట్లు అనేక యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు. ఏకంగా తొమ్మిది ఎన్నికలను నిర్వహించిన అపార అనుభవం ఉన్నవారు. ఈ ఎన్నికలు ఆయనకు, పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి. ఒక్కమాటలో చెప్పాలంటే జనసేన, బీజేపీలకు చెలగాటం. టీడీపీకి ప్రాణ సంకటం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకి బాగా తెలుసు. కేసులు చుట్టుముడుతాయి. ఇప్పటికే ఆయన బెయిల్ పై బయట ఉన్నారుap elections 20204{#}Nara Lokesh;Shakti;CBN;Elections;Bharatiya Janata Party;Jagan;YCP;Partyచంద్రబాబు ఉక్కు కౌగిట్లో.. పవన్‌, బీజేపీకి ఊపిరాడట్లేదా?చంద్రబాబు ఉక్కు కౌగిట్లో.. పవన్‌, బీజేపీకి ఊపిరాడట్లేదా?ap elections 20204{#}Nara Lokesh;Shakti;CBN;Elections;Bharatiya Janata Party;Jagan;YCP;PartyMon, 08 Apr 2024 08:37:24 GMTఏపీలో మూడు పార్టీలు కూటమి కట్టాయి. అందులో పెద్ద పార్టీ పెద్దన్న పార్టీ టీడీపీ. దానికి అధినాయకుడు చంద్రబాబు. 40 ఇయర్స్ ఇండస్ర్టీ. ఆయన స్వయంగా చెప్పుకుంటున్నట్లు అనేక యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు. ఏకంగా తొమ్మిది ఎన్నికలను నిర్వహించిన అపార అనుభవం ఉన్నవారు. ఈ ఎన్నికలు ఆయనకు, పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి.


ఒక్కమాటలో చెప్పాలంటే జనసేన, బీజేపీలకు చెలగాటం. టీడీపీకి ప్రాణ సంకటం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకి బాగా తెలుసు. కేసులు చుట్టుముడుతాయి. ఇప్పటికే ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.  పార్టీ ఇప్పటికే బలహీన పడుతోంది. ఈసారి కూడా ఓడితే పార్టీ భవిష్యత్తుతో పాటు లోకేశ్ రాజకీయ ఫ్యూచర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఆయన ఏడుపదుల వయసులోను ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని జగన్ పై పోరాడుతున్నారు.


ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ ఎన్నికల్లో తన శక్తి చాలదని అటు జనసేన, ఇటు బీజేపీ సాయం తీసుకొని కూటమి కట్టారు. అయితే కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర పార్టీలను తక్కువ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  చంద్రబాబు తన అవసరాలు తీరేంత వరకు తనతో ఉంచుకొని ఆ తర్వాత పక్కన పెడతారన్న అపవాదు ఎలాగూ ఉంది. ఈ క్రమంలో వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


చంద్రబాబు కూటమిలోని బీజేపీ, జనసేనను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీకి రాజకీయ ఉనికి లేకుండా చేస్తున్నారని.. ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న నాయకులకు నిరాశేనని తెలిపారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని వివరించారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే  అదే జరగాలని కోరుకుంటున్నారని విమర్శించారు. అంత బాగానే ఉన్నా ఎప్పుడూ జనసేన, బీజేపీలను విమర్శించే సజ్జల ఒక్కసారిగా ఈ రెండు పార్టీలపై సానుభూతి చూపించడమే ఇప్పుడు చర్చనీయాంశ అంశం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>