Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle1676b04b-aae8-4807-8a6c-d55824e1fa9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle1676b04b-aae8-4807-8a6c-d55824e1fa9f-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ” పుష్ప 2”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. 'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో మరోసారి న#socialstars lifestyle{#}sukumar;Arjun;Crush;Gift;Mass;Allu Arjun;Blockbuster hit;sree;Director;Hero;Cinema;Indiaపుష్ప మాస్ జాతర మొదలైంది.. రికార్డుల వేట షురూ..!!పుష్ప మాస్ జాతర మొదలైంది.. రికార్డుల వేట షురూ..!!#socialstars lifestyle{#}sukumar;Arjun;Crush;Gift;Mass;Allu Arjun;Blockbuster hit;sree;Director;Hero;Cinema;IndiaMon, 08 Apr 2024 12:29:22 GMTఐకాన్  స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ” పుష్ప 2”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.. గతం లో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. 'పుష్ప 2' లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో మరోసారి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేయనుంది.. విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు.

నేడు అల్లుఅర్జున్ పుట్టినరోజు దీనితో పుష్ప 2 నుంచి మేకర్స్ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు.విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. 'పుష్ప 2' టీజర్ లో గంగమ్మ జాతరను హైలైట్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఆ లుక్ ఈ టీజర్ లోనూ కంటిన్యూ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.అల్లు అర్జున్ బర్త్ డేకి సుకుమార్ బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. 'పుష్ప2' టీజర్ తో రికార్డుల మాస్ జాతర మొదలు అయింది.ఈ టీజర్ తో పుష్ప 2 ఆగస్టు 15న  థియేటర్లలో కి  వస్తుందని మేకర్స్ స్పష్టం చేసారు.. పుష్ప 2 మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని మాస్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>