Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vadinatho-maridi-kaapuram-chivarikieb1fed28-0032-4070-b64b-b7adc3cc7bfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vadinatho-maridi-kaapuram-chivarikieb1fed28-0032-4070-b64b-b7adc3cc7bfd-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో లోకం తీరు పూర్తిగా మారిపోయింది. మానవ బంధాలకు విలువ ఇచ్చే మనుషులు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు ఏకంగా నీచాతి నీచమైన పనులు చేసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. క్షణకాల సుఖం కోసం తాము మనుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి అడవుల్లో ఉండే జంతువుల కంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏకంగా అమ్మలా భావించాల్సCrime{#}Warangal;marriage;Traffic police;policeవదినతో మరిది కాపురం.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. చివరికి?వదినతో మరిది కాపురం.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. చివరికి?Crime{#}Warangal;marriage;Traffic police;policeSun, 07 Apr 2024 16:00:00 GMTఇటీవల కాలంలో లోకం తీరు పూర్తిగా మారిపోయింది. మానవ బంధాలకు విలువ ఇచ్చే మనుషులు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు ఏకంగా నీచాతి నీచమైన పనులు చేసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. క్షణకాల సుఖం కోసం తాము మనుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి అడవుల్లో ఉండే జంతువుల కంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏకంగా అమ్మలా భావించాల్సిన వదినతో మరిది కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చివరికి ఈ విషయంపై సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బచ్చు తాండా శివారు చిన్న తాండకు చెందిన యువకుడికి ఎళ్లాయి గూడానికి చెందిన యువతితో 2017 లో పెళ్లి జరిగింది. అయితే పెళ్ళయ్ ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షించిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టడం అసాధ్యమని తెలుసు చెప్పారు.


 దీంతో భర్తతో కాపురం చేయలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది యువతి. ఇక ఆ తర్వాత అత్తమామ మరిది యువతి వద్దకు వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆసుపత్రిలో చూపిస్తామని సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చారు. తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లడం కాదు ఏకంగా మరిదితో కాపురం చేయాలని అప్పుడు పిల్లలు పుడతారని ఒత్తిడి తీసుకొచ్చారు. విషయం ఆసరా చేసుకుని.. మనందరం కలిసి సంతోషంగా ఉందాము. ఆస్తిపాస్తులు మనమే అనుభవిద్దాం అంటూ నమ్మబలికిన మరిది వదినతో కాపురం చేయడం మొదలు పెట్టాడు. వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా జన్మించారు  అయితే ఎన్నో రోజులు పాటు గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా సాగింది. గత కొంతకాలం నుంచి అత్త మామ మరిది తరచూ ఆమెతో గొడవ పడటం మొదలుపెట్టారు. పుట్టింటికి వెళ్ళి పోవాలంటు ఒత్తిడి చేయడం సాగించారు. ఇక వేరే పెళ్లి చేసుకునేందుకు మరిది సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మహిళ వెంటనే పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>