PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-is-well-prepared-to-meet-peak-power-demandfc73709f-0837-4e3f-a8a9-58a361de61ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-is-well-prepared-to-meet-peak-power-demandfc73709f-0837-4e3f-a8a9-58a361de61ab-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. తుక్కుగూడ జనజాతర మహాసభ వేదికగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవరును పోలీసులు కొట్టినట్టు సమాచారం అందుతోంది. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభలో భట్టి కాన్వాయిని అనుమతించకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. bhatti vikramarka{#}Telangana;Telangana Chief Minister;Deputy Chief Minister;police;News;Traffic police;Driver;CM;yadadriమరోసారి భట్టికి అవమానం...?మరోసారి భట్టికి అవమానం...?bhatti vikramarka{#}Telangana;Telangana Chief Minister;Deputy Chief Minister;police;News;Traffic police;Driver;CM;yadadriSun, 07 Apr 2024 18:50:04 GMTతెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. తుక్కుగూడ జనజాతర మహాసభ వేదికగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవరును పోలీసులు కొట్టినట్టు సమాచారం అందుతోంది. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభలో భట్టి విక్రమార్క కాన్వాయిని అనుమతించకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా, సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్ పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నట్టు సమాచారం. అలాగే జేబులో ఉన్న ఐడి కార్డును సీపీ గుంజుకున్నారట. సభా ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమనిగిన అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో సీపీ కొట్టించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ ఫోన్లను గుంజుకొని వీడియో తీసిన వ్యక్తి పై కూడా పోలీసులు చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం చెక్కర్లు కొడుతుండడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే గౌరవం లేదా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం యాదాద్రిలో సైతం భట్టికి అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి ఆలయంలో కుర్చీలపై కూర్చుంటే భట్టి విక్రమార్క కింద కూర్చున్నారు. దీంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది, బహుజనుడు కావడంతోనే భట్టిని అవమానించారు అంటూ పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మరోసారి భట్టి కాన్వాయిని పోలీసులు ఆపడంతో భట్టి అభిమానులు ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని పెద్దల సపోర్ట్ తోనే పోలీసు అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>