PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-singanamala-yamini-bala-goodbay549e8ad8-97d7-468e-bd3d-a5dcaec9ec91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-singanamala-yamini-bala-goodbay549e8ad8-97d7-468e-bd3d-a5dcaec9ec91-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లాకు చెందిన శింగనమల నియోజకవర్గం లో వైసీపీ పార్టీకి మరొక షాక్ తగిలింది.. శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినిబాల వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె నిన్నటి రోజున ఒక వీడియో కూడా విడుదల చేశారు.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యామినిబాల 2014లో టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆ తర్వాత తనకు సీటు రాకపోవడంతో 2019లో పోటీ చేయలేదు.. 2020లో వైసీపీ పార్టీలో చేరింది. ప్రస్తుతం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డికి ఎలాంటి ప్రాధాYCP;SINGANAMALA;YAMINI BALA;GOODBAY{#}yamini;రాజీనామా;Scheduled caste;Nalamada Padmavathi Reddy;Driver;samanthakamani;Jonnalagadda Padmavathy;MLA;Yevaru;Husband;TDP;YCP;Party;Newsరాయలసీమ (శింగనమల) వైసిపికి షాక్ పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే..!రాయలసీమ (శింగనమల) వైసిపికి షాక్ పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే..!YCP;SINGANAMALA;YAMINI BALA;GOODBAY{#}yamini;రాజీనామా;Scheduled caste;Nalamada Padmavathi Reddy;Driver;samanthakamani;Jonnalagadda Padmavathy;MLA;Yevaru;Husband;TDP;YCP;Party;NewsSun, 07 Apr 2024 06:33:00 GMTఅనంతపురం జిల్లాకు చెందిన శింగనమల నియోజకవర్గం లో వైసీపీ పార్టీకి మరొక షాక్ తగిలింది.. శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినిబాల వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె నిన్నటి రోజున ఒక వీడియో కూడా విడుదల చేశారు.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యామినిబాల 2014లో టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆ తర్వాత తనకు సీటు రాకపోవడంతో 2019లో పోటీ చేయలేదు.. 2020లో వైసీపీ పార్టీలో చేరింది. ప్రస్తుతం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా గడిచిన ఐదేళ్లలో సొంత నియోజకవర్గ నాయకులదే పై చేయిగా  ఉండడంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తమకు.. తమ తల్లి శమంతమనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో చాలాకాలంగా వీరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. వచ్చే ఎన్నికలలో తన కుమారుడికి(అశోక్ కు) సీటు ఇవ్వమని  శమంతకమణి వైసిపి అధిష్టానాన్ని కోరినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదట.. వీటితో పాటు జొన్నలగడ్డ పద్మావతి కి టికెట్ నిరాకరించి.. ఆ బాధ్యతను కూడా తన భర్త సాంబశివారెడ్డి పైన ఉంచడంతో ఆయన తన వద్ద ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు కు టికెట్ ఇప్పించారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


దీంతో చాలామంది నేతలు కూడా వైసిపి పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు.. సాంబశివారెడ్డి ఆధీనంలో ఉండేటువంటి వీరాంజనేయులు తాము సహకరించబోమంటూ అక్కడి నేతలు అసమ్మతి గళం కూడా విప్పిన సందర్భాలు ఉన్నాయి.. దీంతో యామిని బాల కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.. అభ్యర్థిని మార్చాలి అంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన ఎవరు పట్టించుకోలేదట.. ఈ నేపథ్యంలో  యామిని బాల వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగా ఒక వీడియోను విడుదల చేసింది.. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో సాంబశివారెడ్డి పెత్తనం ఎక్కువ అయ్యిందని దీంతో వైసిపి లోని ఎస్సీ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>