PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-manchodu-who-was-admired-by-jagan-in-ycp-become-an-mp-in-tdp16cecabe-cde7-4b32-99d1-c2f889d2ff3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-manchodu-who-was-admired-by-jagan-in-ycp-become-an-mp-in-tdp16cecabe-cde7-4b32-99d1-c2f889d2ff3c-415x250-IndiaHerald.jpgనెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపెవరిది అంటే... ఠక్కున చెప్పే సమాధానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేంటి పార్టీ పేరు చెప్పకుండా వ్యక్తి పేరు అనుకుంటే... ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తికే ప్రాధాన్యత ఉందనేది వాస్తవం. నెల్లూరు పెద్దారెడ్ల మధ్య పోటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిదే పై చెయ్యి. నెల్లూరు నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. తొలుత కాంగ్రెస్... ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా నెల్లూరు పార్లమెంట్‌కు పేరు. అలాంటి చోట ఈసారి గెలుపే లక్ష్యంAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; vemireddy Prabhakar Reddy{#}prabhakar;prasanthini;Nellore;Chintamaneni Prabhakar;narasaraopet;P Anil Kumar Yadav;Parakala Prabhakar;MP;Assembly;Parliment;Wife;MLA;Yevaru;Telugu Desam Party;CBN;Party;TDP;YCPవైసీపీలో జ‌గ‌న్ మెచ్చిన మంచోడు టీడీపీలో ఎంపీ అవుతాడా..?వైసీపీలో జ‌గ‌న్ మెచ్చిన మంచోడు టీడీపీలో ఎంపీ అవుతాడా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; vemireddy Prabhakar Reddy{#}prabhakar;prasanthini;Nellore;Chintamaneni Prabhakar;narasaraopet;P Anil Kumar Yadav;Parakala Prabhakar;MP;Assembly;Parliment;Wife;MLA;Yevaru;Telugu Desam Party;CBN;Party;TDP;YCPSun, 07 Apr 2024 09:01:37 GMTనెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపెవరిది అంటే... ఠక్కున చెప్పే సమాధానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేంటి పార్టీ పేరు చెప్పకుండా వ్యక్తి పేరు అనుకుంటే... ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తికే ప్రాధాన్యత ఉందనేది వాస్తవం. నెల్లూరు పెద్దారెడ్ల మధ్య పోటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిదే పై చెయ్యి. నెల్లూరు నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. తొలుత కాంగ్రెస్... ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా నెల్లూరు పార్లమెంట్‌కు పేరు. అలాంటి చోట ఈసారి గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది.

నిన్నటి వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి... హఠాత్తుగా టీడీపీలో చేరారు. దీంతో ఆయన ఎంపీ అభ్యర్థి అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి మధ్య గురుశిష్యుల బంధం. నిన్నటి వరకు వేమిరెడ్డిని రాజకీయ గురువుగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి.

అందుకే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే... మేమిద్దరం గెలిచినట్లే అనే వ్యాఖ్యలు కూడా విజయసాయి చేయడం సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకకవవర్గాలను వైసీపీ గెలుచుకుంది. దీంతో నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో ఇద్దరికి టీడీపీ టికెట్లు కేటాయించింది. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట బదిలీ అయ్యారు.

ఆయన సొంత బాబాయ్ కూడా ఇప్పుడు టీడీపీలో చేరారు. ఆర్థికంగా బలమైన నేతగా వేమిరెడ్డికి గుర్తింపు. అలాగే నెల్లూరుకే చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా  ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్లు అంతా టీడీపీ కూటమికి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో రాబోయే నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమనే అంటున్నారు. అయితే పార్ల‌మెంటు ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ప‌లు చోట్ల వైసీపీ బ‌లంగా ఉన్నా ఎంపీకి వ‌చ్చే స‌రికి క్రాస్ ఓటింగ్ ప‌డుతుంద‌నే అంచ‌నాలే ఎక్కువుగా ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>