EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4b7cb429-970e-4386-bc85-636c1b6bf61c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4b7cb429-970e-4386-bc85-636c1b6bf61c-415x250-IndiaHerald.jpgఏపీలో వాలంటీర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే దీనిని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ వైసీపీ ఏ ఉద్దేశంతో ప్రవేశ పెట్టినా దాని మీద లెక్కలేనంతగా ఈ ఐదేళ్లు రాజకీయం సాగుతూ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉండొద్దు అనే తరహాలో విపక్షాలు ఒక తరహాలో విమర్శలు చేశాయి. అయితే వాలంటీర్లపై విపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు తన మాట మార్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మరింత మెరుగైన జీవితాన్ని ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్chandrababu{#}Kumaar;Episode;U Turn;Andhra Pradesh;Jagan;politics;war;Election Commission;YCP;Father;CBN;Manamచంద్రబాబు: మాంచి ఊపులో ఉంటే పింఛన్లు భలే దెబ్బ కొట్టేశాయే?చంద్రబాబు: మాంచి ఊపులో ఉంటే పింఛన్లు భలే దెబ్బ కొట్టేశాయే?chandrababu{#}Kumaar;Episode;U Turn;Andhra Pradesh;Jagan;politics;war;Election Commission;YCP;Father;CBN;ManamSun, 07 Apr 2024 08:25:11 GMTఏపీలో వాలంటీర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే దీనిని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ వైసీపీ ఏ ఉద్దేశంతో ప్రవేశ పెట్టినా దాని మీద లెక్కలేనంతగా ఈ ఐదేళ్లు రాజకీయం సాగుతూ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉండొద్దు అనే తరహాలో విపక్షాలు ఒక తరహాలో విమర్శలు చేశాయి.


అయితే వాలంటీర్లపై విపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు తన మాట మార్చారు.  తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మరింత మెరుగైన జీవితాన్ని ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రతి సభ లోను చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో పింఛన్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. దీనంతటకీ కారణం చంద్రబాబే అని వైసీపీ ప్రచారం చేస్తోంది. గతంలో  ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని విపక్షాలు కోరడం ఈసీ ఓకే చెప్పేయడం చకచకా జరిగిపోయాయి.


ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు ఈ మూడు నెలలు వద్దు అని మరో వినతి అందించి.. వాలంటీర్లపై వేటు వేయించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలకంగా వ్యవహరించగా.. తెర వెనుక చంద్రబాబు మంత్రాగం నడిపారనేది సుస్పష్టం. అయితే ప్రస్తుతం పింఛన్ దారుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటంతో వెంటనే తన మార్కు యూటర్న్ ను చంద్రబాబు తీసుకున్నారు.


తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేయడం దారుణం. మనం చేసే మంచి పనుల వల్ల ఓట్లు అడగాలి. శవ రాజకీయాలు మానుకోవాలి. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. బాబాయ్ చనిపోతే సానుభూతి పొందారు. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని వైసీపీ పన్నాగం పన్నింది. మేం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తాం. పింఛన్లు డోర్ డెలివరీ చేయోద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఏపీ ప్రజలందరకీ తెలుసని.. ఇప్పటికి అయినా చంద్రబాబు యూ టర్న్ రాజకీయాలు మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>