Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr899c5efd-cbc6-416c-974b-d42fff722809-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr899c5efd-cbc6-416c-974b-d42fff722809-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇలాంటి సమయంలో ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బంగపాటుకు గురై కేవలం ప్రతిపక్ష హోదాతో మాత్రమే సరిపెట్టుకున్న బిఆర్ఎస్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కనీసం పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలి అని గులాబీ దళపతి అనుకుంటూ ఉండగా.. ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే కారు వీడి కాంగ్రెస్ గూటికి చేరుతాడో అనే టెన్షన్ కేసీఆర్కు పట్టుకుంది. ఇప్పటికే కారు పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా కేసిఆర్ కు గుడ్ బైKcr{#}Kala Venkata Rao;Joseph Vijay;Medak;Nijam;Venkata Rao;Dalapathi;Revanth Reddy;Yevaru;News;Parliament;revanth;Reddy;KCR;Telangana;Car;MLA;Minister;Assembly;Congress;Partyకేసీఆర్ కు బిగ్ షాక్.. 25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి?కేసీఆర్ కు బిగ్ షాక్.. 25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి?Kcr{#}Kala Venkata Rao;Joseph Vijay;Medak;Nijam;Venkata Rao;Dalapathi;Revanth Reddy;Yevaru;News;Parliament;revanth;Reddy;KCR;Telangana;Car;MLA;Minister;Assembly;Congress;PartySun, 07 Apr 2024 09:27:07 GMTపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇలాంటి సమయంలో ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బంగపాటుకు గురై కేవలం ప్రతిపక్ష హోదాతో మాత్రమే సరిపెట్టుకున్న బిఆర్ఎస్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కనీసం పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలి అని గులాబీ దళపతి అనుకుంటూ ఉండగా.. ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే కారు వీడి కాంగ్రెస్ గూటికి చేరుతాడో అనే టెన్షన్ కేసీఆర్కు పట్టుకుంది.


 ఇప్పటికే కారు పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా కేసిఆర్ కు గుడ్ బై చెప్పేసి.. అటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కడియం,  కేకే లాంటి బడాబడా నేతలు సైతం పార్టీ మారడంతో మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు అనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. తమ పార్టీ గేట్లు ఎత్తింది అంటే కేవలం కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా ఎవరు కూడా బిఆర్ఎస్ పార్టీలో మిగలరు అంటూ అటు రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాట ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజం అయ్యేలాగే ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవలే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రెస్మీట్ లో ఎంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు అనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


 బిఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు. త్వరలోనే మీ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలో చేరబోతున్నారు అంటూ ఇటీవలే ఉత్తంకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 104 మంది ఎమ్మెల్యేలున్న మీ పార్టీని జనం బొంద పెడితే 39కి వచ్చారని.. ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో కూడా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇలా కారుని వదిలేయబోయే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది హాట్ టాపిక్ మారింది. ఇప్పటికే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరగా.. మెదక్ నుండి కూడా ఎమ్మెల్యేలు కీలక నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక గ్రేటర్ నుండి కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>