EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu93c0619e-1ae8-4e8e-835b-e17f4020365c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu93c0619e-1ae8-4e8e-835b-e17f4020365c-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ప్రత్యర్థులను దెబ్బతీసి తాము అధికారం చేపట్టడం సహజం. దీని కోసం కొంతమంది ప్రత్యర్థులను తమ శక్తి సామర్థ్యాలు, అధికార బలాలతో అడ్డుకుంటూ ఉంటారు. ఇవి చర్చనీయాంశం అయినా.. పవర్ కోసం రాజకీయ పార్టీలు కొట్లాటను సమర్థిస్తుంటారు. అధికారం కోసం ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అనేది సహించకూడనది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆపేయించడం ద్వారా చంద్రబాబు ఈ తరహా రాజకీయ క్రీడకు తెరతీశారు. వ్యూహం ప్రకారం ముందుగా వాలంటీర్లను ఎన్నిchandrababu{#}Manam;Kumaar;Shakti;Election Commission;CBNచంద్రబాబు: ఆ డైలాగ్‌ కొట్టకుండా ఉండాల్సింది.. ఇప్పుడు అడ్డంగా దొరికారు?చంద్రబాబు: ఆ డైలాగ్‌ కొట్టకుండా ఉండాల్సింది.. ఇప్పుడు అడ్డంగా దొరికారు?chandrababu{#}Manam;Kumaar;Shakti;Election Commission;CBNSun, 07 Apr 2024 13:00:00 GMTరాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ప్రత్యర్థులను దెబ్బతీసి తాము అధికారం చేపట్టడం సహజం. దీని కోసం కొంతమంది ప్రత్యర్థులను తమ శక్తి సామర్థ్యాలు, అధికార బలాలతో అడ్డుకుంటూ ఉంటారు. ఇవి చర్చనీయాంశం అయినా.. పవర్ కోసం రాజకీయ పార్టీలు కొట్లాటను సమర్థిస్తుంటారు.


అధికారం కోసం ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అనేది సహించకూడనది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆపేయించడం ద్వారా చంద్రబాబు ఈ తరహా రాజకీయ క్రీడకు తెరతీశారు. వ్యూహం ప్రకారం ముందుగా వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి.. పింఛన్లను పంపిణీ చేయనివ్వకుండా ఆపేయించారు. దీంతో ఇప్పుడు మూడు నెలల పాటు వృద్ధులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.


ఈ సమయంలో పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు సొమ్మసిల్లి పడిపోవడం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నెపాన్ని తప్పించుకునేందుకు చంద్రబాబు జగన్ పై పలు ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 1న ఇవ్వాల్సిన పింఛన్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు. ఓటమి భయంతోనే అప్పు తెచ్చిన డబ్బులను గుత్తేదారులకు రూ.13 వేల కోట్లు దోచి పెట్టారు అని ఆరోపించారు.


మార్చితో బడ్జెట్ ముగుస్తుంది. దీంతో ముందే నిధులు ఖాతా నుంచి తీసుకోవాలి.  దీన్ని గమనించి డబ్బును డ్రా చేసి పింఛన్లు అందిస్తే ఇబ్బందులు ఉండవు. స్వార్థ రాజకీయాలతో ఖజానాను ఖాళీ చేశారు. వాలంటీర్లు మాత్రమే పింఛన్ల పంపిణీ లో పాల్గొనవద్దని ఈసీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పింఛన్ ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదు అంటూ వ్యాఖ్యానించారు.  ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే.. చంద్రబాబు చెప్పిన లాజిక్ ప్రకారం సచివాలయాల దగ్గర పింఛన్ డబ్బులు ఉండకూడదు. కానీ 85 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.  మిగతాది ఒకటి, రెండు రోజుల్లో పూర్తవుతుంది. మరి డబ్బులు లేవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయినట్లే కదా అని పలువురు పేర్కొంటున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>