PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mydukuru-tdp-ycpd637cebf-e42b-45bb-9013-1d7f319a5035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mydukuru-tdp-ycpd637cebf-e42b-45bb-9013-1d7f319a5035-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో వైసీపీ పార్టీకి పట్టు ఉన్న జిల్లాలలో కడప కూడా ఒకటి.. ఇక్కడున్న హాట్ సీట్లలో మైదుకూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సెగ్మెంట్లో అధిక భాగం రైతులే ఉంటారు. ముఖ్యంగా 90 శాతం మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.. అలాంటి నియోజకవర్గాలలో రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతూ ఉంటాయి.. ఇక్కడ గత ఎన్నికలలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఎలాగైనా ఈసారి పసుపు జెండా ఎగరవేయాలని చూస్తున్నారు చంద్రబాబు. వైసిపి మాత్రం మరొకసారి తమదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈసారి మైదుకూరులో MYDUKURU;TDP;YCP{#}sudhakar;Balija;Scheduled Tribes;Mydukur;Turmeric;Yevaru;kadapa;Backward Classes;war;Scheduled caste;TDP;YCP;Hanu Raghavapudi;politics;Reddyరాయలసీమ (మైదుకూరు): రెడ్డి Vs యాదవ్.. గెలుపెవరిది.?రాయలసీమ (మైదుకూరు): రెడ్డి Vs యాదవ్.. గెలుపెవరిది.?MYDUKURU;TDP;YCP{#}sudhakar;Balija;Scheduled Tribes;Mydukur;Turmeric;Yevaru;kadapa;Backward Classes;war;Scheduled caste;TDP;YCP;Hanu Raghavapudi;politics;ReddySun, 07 Apr 2024 12:34:39 GMTఆంధ్రాలో వైసీపీ పార్టీకి పట్టు ఉన్న జిల్లాలలో కడప కూడా ఒకటి.. ఇక్కడున్న హాట్ సీట్లలో మైదుకూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సెగ్మెంట్లో అధిక భాగం రైతులే ఉంటారు. ముఖ్యంగా 90 శాతం మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.. అలాంటి నియోజకవర్గాలలో రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతూ ఉంటాయి.. ఇక్కడ గత ఎన్నికలలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఎలాగైనా ఈసారి పసుపు జెండా ఎగరవేయాలని చూస్తున్నారు చంద్రబాబు. వైసిపి మాత్రం మరొకసారి తమదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈసారి మైదుకూరులో గెలుపు ఎవరిది అనేది హాట్ టాపిక్ గా మారింది..

మైదుకూరులో అందరూ రైతులే కాబట్టి వ్యవసాయం చేస్తూ అక్కడి వాతావరణం చాలా పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది.. కానీ రాజకీయం విషయానికి వస్తే.. మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత పగ ప్రతీకారాలు పుట్టుకొస్తాయి.అలా మైదుకూరులో రెండు లక్షల ఎనిమిది వేలకు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకున్న వైసిపి..వాళ్ళకి ఓటమి లేకుండా చేసుకున్నారు.. అక్కడ ఎస్సీ , ఎస్టీ , బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నా.. కానీ అక్కడ పొలిటికల్ పరంగా  రెడ్డి ,  యాదవ్స్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది.


అయితే అక్కడ ముస్లిం , ఎస్సీ వర్గాల ప్రజలు మొత్తం రెడ్డి వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు.. శెట్టిపల్లి రఘురామిరెడ్డి బరిలోకి దిగడం కూడా గతంలో విజయానికి నాంది అయింది. యాదవ , బలిజ ఓటర్లతో ముందుకు వెళుతున్న టిడిపి 1999 తరువాత ఓడిపోతూనే ఉంది.. ఇప్పటివరకు అక్కడ  8సార్లు కాంగ్రెస్..చెరో 2సార్లు టిడిపి,  వైసిపి గెలిచాయి. 2014, 2019 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ తరఫు యస్.రఘురామిరెడ్డి గెలిచారు.ఈసారి కూడా రఘురామరెడ్డిని బరిలోకి దింపుతున్నారు..
 

టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు 2019 ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వచ్చాయి.. గతంలో రెండు సార్లు ఓటమి చవిచూసిన పుట్టా సుధాకర్ యాదవ్ ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు.. అందుకు తగుట్టుగానే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. కానీ నియోజకవర్గంలో ఎవరు సరిగా అనుకూలించడం లేదని సమాచారం. వెంకట సుబ్బారెడ్డి, వెంకట కొండారెడ్డి వంటి నేతలకు పుట్టా సుధాకర్ యాదవ్ అంటే గిట్టడం లేదు.మరోవైపు   రెండుసార్లు ఓడిపోయారు అనే సింపతి ఇప్పుడు టిడిపికి బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పోటీ చేసినా వైసీపీ అభ్యర్థి ఎస్ రఘురామరెడ్డికి 45% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్ కు 43% ఓట్లు.. ఇతరులకు 12 శాతం ఓట్లు  వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ఈ నేపథ్యంలోనే సుధాకర్ క్యాడర్ని కలుపుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. లేదంటే మైదుకూరు మళ్లీ వైసిపి వశం అయ్యే అవకాశం ఉన్నది. చూడాలి మరి వచ్చే ఎన్నికల ఫలితాలు ఎవరికీ అనుకూలంగా మారుతాయో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>