PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ysr-congress-disappointed-that-janasena-got-limited-seats49ed7e5b-5ed1-44c9-9b8b-11f2a49ebd47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ysr-congress-disappointed-that-janasena-got-limited-seats49ed7e5b-5ed1-44c9-9b8b-11f2a49ebd47-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీని 151 స్థానాలలో గెలిపించుకోవడం కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. అదే సమయంలో మంగళగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన లోకేశ్, గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ను ఓడించడంలో జగన్ ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో లోకేశ్ మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా పవన్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ycp{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Gajuwaka;రాజీనామా;Nara Lokesh;CM;MP;TDP;Mangalagiri;pithapuram;YCP;Jagan;Yevaruఏపీ : ఆ ముగ్గురిలో ఎవరు గెలిచినా వైసీపీకి చుక్కలే.. జాగ్రత్త పడాల్సిందేనా?ఏపీ : ఆ ముగ్గురిలో ఎవరు గెలిచినా వైసీపీకి చుక్కలే.. జాగ్రత్త పడాల్సిందేనా?ycp{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Gajuwaka;రాజీనామా;Nara Lokesh;CM;MP;TDP;Mangalagiri;pithapuram;YCP;Jagan;YevaruSun, 07 Apr 2024 10:05:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీని 151 స్థానాలలో గెలిపించుకోవడం కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. అదే సమయంలో మంగళగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన లోకేశ్, గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ను ఓడించడంలో జగన్ ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో లోకేశ్ మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా పవన్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.
 
మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా వైసీపీకి చుక్కలే అని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేశ్, పవన్, రఘురామ కృష్ణంరాజు టార్గెట్ గా వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ ముగ్గురినీ ఓడించడం కోసం వైసీపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
 
అయితే స్థానికంగా పరిస్థితులు ఈ నేతలకే అనుకూలంగా ఉన్నాయి. మంగళగిరిలో వైసీపీ చేతులెత్తేస్తోందని తెలుస్తోంది. వైసీపీ అంతర్గత సర్వేలలో సైతం మంగళగిరిలో లోకేశ్ గెలవడం ఖాయమని తేలిపోయింది. వైసీపీ మంగళగిరిలో ముగ్గురు అభ్యర్థులను మార్చినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన రోజు నుంచి ఇప్పటివరకు లోకేశ్ మంగళగిరి ప్రజలకు మేలు చేసేలా చేసిన పనులు ఆయనకు ప్లస్ అయ్యాయి.
 
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయమని మెజార్టీ ఎంతో మాత్రం చెప్పలేమని సర్వేలలో వెల్లడవుతోంది. కనీసం 50 వేల మెజార్టీతో పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఫ్యాన్స్ చెబుతున్నారు. టీడీపీ తరపున ఉండి నుంచి పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు సైతం గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. రఘురామ ఎమ్మెల్యేగా గెలిచి కూటమి అధికారంలోకి వస్తే ఆయన స్పీకర్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. లోకేశ్, పవన్, రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేలుగా గెలిస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందేనని వైసీపీ జాగ్రత్త పడితే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>