PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ganta-vs-avanthiff6ad30b-cadd-4862-9c7b-a9d6b18a4712-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ganta-vs-avanthiff6ad30b-cadd-4862-9c7b-a9d6b18a4712-415x250-IndiaHerald.jpgవిశాఖ: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ని తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది కానీ గెలుపు మాత్రం ఇంకా ఖాయం కాలేదు అంటున్నారు. ఎప్పటి లాగా ఈ సారి భీమిలీ కానే కాదు అని రాజకీయంగా అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయన ప్రత్యర్ధి మాజీ మంత్రి వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు కూడా బలమైన నేత. ఆయనకు గంటా లాగానే వ్యూహాలు పన్నడం తెలుసు. ఇక గంటా శ్రీనివాసరావు అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండి ఏమి చేశారని అవంతి ప్రశ్నిస్తున్నారు.ఆయన గెలిచాక తన వలె జనంలో తిరిగారా అసలు కనిపించారా అని ప్Ganta Vs Avanthi{#}GANTA SRINIVASA RAO;avanthi srinivas;Ishtam;Bheemili;Janasena;Telugu Desam Party;YCP;war;Yevaru;Ministerవిశాఖ: ఓటమి ఎరుగని నేతల్లో ఎవరు నెగ్గేను?విశాఖ: ఓటమి ఎరుగని నేతల్లో ఎవరు నెగ్గేను?Ganta Vs Avanthi{#}GANTA SRINIVASA RAO;avanthi srinivas;Ishtam;Bheemili;Janasena;Telugu Desam Party;YCP;war;Yevaru;MinisterSun, 07 Apr 2024 11:35:00 GMTవిశాఖ: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ని తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది కానీ గెలుపు మాత్రం ఇంకా ఖాయం కాలేదు అంటున్నారు. ఎప్పటి లాగా ఈ సారి భీమిలీ కానే కాదు అని రాజకీయంగా అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయన ప్రత్యర్ధి మాజీ మంత్రి వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు కూడా బలమైన నేత. ఆయనకు గంటా లాగానే వ్యూహాలు పన్నడం తెలుసు. ఇక గంటా శ్రీనివాసరావు అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండి ఏమి చేశారని అవంతి ప్రశ్నిస్తున్నారు.ఆయన గెలిచాక తన వలె జనంలో తిరిగారా అసలు కనిపించారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక గంటా అవంతిల మధ్య రాజకీయ పోటీ కొత్తగా ఉంది. వైసీపీ నుంచి ఒక నేతను గంటా తెలుగు దేశం పార్టీలో చేర్చుకుంటే ధీటుగా అవంతి టీడీపీ నుంచి మరో నేతను వైసీపీలోకి తెస్తున్నారు.ఇంకా అంతే కాదు గంటా వైసీపీ వైపు చూస్తే తాను తెలుగు దేశం నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్పిస్తాను అంటున్నారు. తెలుగుదేశం అసమ్మతి నేతల విషయంలో అవంతి పావులు కదుపుతున్నారు వారిని తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


అది తెలిసి గంటా శ్రీనివాసరావు ఎన్నడూ లేని విధంగా వారి ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగిస్తునారు. తనతో పాటు నడవాలని ఆయన కోరుతున్నారు.ఇంకా అలాగే జనసేన నేతల విషయంలో వైసీపీ దృష్టి పెట్టింది. గంటాకు టికెట్ ఇవ్వడం జనసేన పార్టీలో వారికి ఇష్టం లేదు. వారంతా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.అందువల్ల వైసీపీ వారిని తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది. 2014 లో గంటా శ్రీనివాసరావు భీమిలీలో ఏకపక్షంగా గెలిచారు.అప్పుడు ఆయన మీద పెట్టిన వైసీపీ అభ్యర్ధి జోరు చేయలేకపోవడం కూడా ఉపకరించింది.ప్రస్తుతం పోటీలో ఉన్నది కూడా ఒకనాటి గంటా సహచరుడే. తనకు గంటా గురించి పూర్తిగా తెలిసిన వారే కావడంతో గంటా తనతోనే తాను యుద్ధం చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అలాగే ఇక్కడ మరో పోలిక కూడా ఉంది. గంటా శ్రీనివాస రావుని ఓటమెరుగని వీరుడిగా చెప్పుకుంటారు. అలాగే అవంతి కూడా అంతే. ఆయన కూడా ఎన్నడూ ఓడిపోలేదు. అయితే ఇద్దరిలో ఈసారి ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు. ఆ ఓడే వారు ఎవరు. గెలిచే వారు ఎవరు అన్నదే భీమిలీ జనాల్లో హై టెన్షన్ పెడుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>