PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-69aaa52a-5406-427f-9512-ceec8c31ca67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-69aaa52a-5406-427f-9512-ceec8c31ca67-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో రాబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు కలిగిన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ క్రేజ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించగా ఆ తర్వాత జనసేన, బీజేపీ పార్టీలు సీట్లను దక్కించుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో కొంతమంది టీడీపీ నేతలు ఇక్కడి సీటు మాకే కావాలి అంటే టిడిపి పార్టీ నుండి అయినా సరే Tdp {#}Mandali Buddha Prasad;Bhimavaram;Avanigadda;March;kalyan;Bharatiya Janata Party;Assembly;Andhra Pradesh;Parliment;Janasena;Telugu Desam Party;TDP;Partyటీడీపీ నేతలకు భారీ ఆఫర్ ఇస్తున్న పవన్..!టీడీపీ నేతలకు భారీ ఆఫర్ ఇస్తున్న పవన్..!Tdp {#}Mandali Buddha Prasad;Bhimavaram;Avanigadda;March;kalyan;Bharatiya Janata Party;Assembly;Andhra Pradesh;Parliment;Janasena;Telugu Desam Party;TDP;PartySat, 06 Apr 2024 15:18:00 GMTమరికొన్ని రోజుల్లో రాబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు కలిగిన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ క్రేజ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించగా ఆ తర్వాత జనసేన, బీజేపీ పార్టీలు సీట్లను దక్కించుకున్నాయి.

పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో కొంతమంది టీడీపీ నేతలు ఇక్కడి సీటు మాకే కావాలి అంటే టిడిపి పార్టీ నుండి అయినా సరే లేకపోతే జనసేనలోకి వెళ్లిన సరే మాకు టికెట్ కావాలి అని అభ్యర్థించారు. అలాంటి వారిలో అవనిగడ్డ క్యాండిడేట్ మండలి బుద్ధ ప్రసాద్ ఒకరు. ఈయన టిడిపి పార్టీ నుండి టికెట్ ను ఆశించారు. కాకపోతే ఆ నియోజకవర్గాన్ని జనసేనకు ఇవ్వడంతో వెంటనే ఈయన కండువా మార్చి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరి టికెట్ దక్కించుకున్నాడు.

ఇక ఈ ఏరియాలో మండలి బుద్ధ ప్రసాద్ కి జనసేన నుండి టికెట్ ను కన్ఫర్మ్ చేయడంతో ఆ ఏరియా జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇన్ని రోజుల పాటు వేరే పార్టీలో ఉన్న వారికి సీటు ఇవ్వడం ఏంటి? మేము ఈ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మమ్మల్ని కాదు అని వేరే వాళ్ళకి ఇవ్వడం సరికాదు అంటూ ఇక్కడి ప్రజలు జనసేన అధిష్టానం పై బగ్గుమంటున్నారు. భీమవరం అసెంబ్లీ స్థానాన్ని మాజీ టిడిపి ఎమ్మెల్యే రామాంజనేయులును ఇచ్చారు. మొదట ఇక్కడ నుండి పవన్ పోటీ చేద్దాం అనుకున్నాడు.

కానీ కొన్ని సమీకరణాలవల్ల ఈ సీటును రామాంజనేయులు ఇచ్చేశారు. పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఇటీవలే పిఠాపురంలో పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఇక్కడ సీటు ఇప్పటివరకు ఎవరికీ కన్ఫామ్ కాలేదు. ఈ ఏరియా అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కన్ఫామ్ చేశారు. ఇక్కడి సీట్ ను జనసేన నుండి నిమ్మక జయకృష్ణ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ పాత నాయకులు అంతా జనసేనలోకి చేరి టికెట్ లను దక్కించుకుంటున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>