EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan35dfef9d-e928-4d49-8998-2d181e6ff898-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan35dfef9d-e928-4d49-8998-2d181e6ff898-415x250-IndiaHerald.jpgరాజకీయ వ్యూహాలను సిద్ధం చేయడం ఒక ఎత్తు. వాటిని సమర్థంగా అమలు చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో తెలుగుదేశం వ్యూహకర్తలు తరచూ ఫెయిల్ అవుతున్నారు. తాజాగా అలాంటే పరిస్థితే మరోసారి పునరావృతం అయింది. పింఛన్లను ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చే వ్యవస్థను ఆపడం ద్వారా ఏదో సాధిస్తామని లెక్కలు వేసుకుంటే.. అది రివర్స్ అయింది. దీంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఏదోలా ప్రభుత్వంపై విమర్శలు చేసి.. వారిపై ఒత్తిడి పెంచి దాని ద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఐదేళ్లుగా ప్రతి నెల పింఛన్ డబ్బులు ఠంచన్ గా అందే వేళjagan{#}Telugu Desam Party;advertisement;Telugu;Jagan;TDPజగన్‌ మానవత్వం.. టీడీపీ వాళ్లకు ఎప్పటికీ అర్థం కాదా?జగన్‌ మానవత్వం.. టీడీపీ వాళ్లకు ఎప్పటికీ అర్థం కాదా?jagan{#}Telugu Desam Party;advertisement;Telugu;Jagan;TDPSat, 06 Apr 2024 11:00:00 GMTరాజకీయ వ్యూహాలను సిద్ధం చేయడం ఒక ఎత్తు. వాటిని సమర్థంగా అమలు చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో తెలుగుదేశం వ్యూహకర్తలు తరచూ ఫెయిల్ అవుతున్నారు. తాజాగా అలాంటే పరిస్థితే మరోసారి పునరావృతం అయింది. పింఛన్లను ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చే వ్యవస్థను ఆపడం ద్వారా ఏదో సాధిస్తామని లెక్కలు వేసుకుంటే.. అది రివర్స్ అయింది.


దీంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఏదోలా ప్రభుత్వంపై విమర్శలు చేసి.. వారిపై ఒత్తిడి పెంచి దాని ద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.  ఐదేళ్లుగా ప్రతి నెల పింఛన్ డబ్బులు ఠంచన్ గా అందే వేళ. ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సాగు చెప్పి అడ్డుకోవడం ద్వారా తమకు తిప్పలుగా మారుతాయనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మరిచిపోయారు. పింఛన్ల పంపిణీ కి సంబంధించిన అభ్యంతరాల్నీ తెరపైకి తీసుకు వచ్చే సమయంలో దాని కారణంగా ఎదురయ్యే సమస్యలు, పరిస్థితులు ఏమిటన్న దానిపై టీడీపీ నాయకులకు సరైన మదింపు తెలియదనే చెప్పాలి.


పింఛన్లు ఆపారనే అపవాదును టీడీపీ ఎలాగూ మూట గట్టుకుంది. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో పలు ప్రకటనలు చేస్తూ ఇంకా అభాసుపాలు అవుతున్నారు.  తాజాగా ఓ వింత ప్రశ్న టీడీపీ శ్రేణుల నుంచి ఉత్పన్నమైంది. పెన్షన్ దారులకు బ్యాంకు అకౌంట్ ఎందుకు తెరవలేదని అంటున్నారు.


ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్యూలైన్లో నిల్చోలేక వృద్దులు ఇబ్బంది పడుతుంటే.. ఇక బ్యాంకు అకౌంట్ల ద్వారా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు ఏమైనా గ్రామానికి ఒకటి ఉంటాయా.. పోనీ ఆయా గ్రామాలకు దగ్గరగా ఉంటాయా. పట్టణాల్లో ఉంటాయి.  నాలుగైదు గ్రామాల వృద్ధులంతా వ్యయ ప్రయాసలు పడి బ్యాంకుల దగ్గరికీ వెళ్తే.. ఎంతమంది అవుతారు. ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకుంటే ఇటువంటి ప్రశ్నలు రావు. అసలు వాళ్లు నడిచే పరిస్థితిలో ఉన్నారా. వాళ్లు తిరిగే స్టేజీలో ఉన్నారా. జగన్ పై ద్వేషంతో మానవత్వ విలువలను మరిచిపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>