PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb76b628c-3fc9-434d-a96a-00fba2f850a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb76b628c-3fc9-434d-a96a-00fba2f850a3-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ సినిమాల పరంగా ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావాలని సంచలనాలు సృష్టించాలని పవన్ అభిమానుల్లో ఆశ ఉన్నా పవన్ సినిమాలకు దూరం కావడం మాత్రం అభిమానులకు అస్సలు ఇష్టం లేదు. పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా బాలయ్యలా సినిమాలు, రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. pawan kalyan{#}kalyan;pithapuram;Akkineni Nageswara Rao;Ishtam;Pawan Kalyan;Yatra;Success;House;News;Janasenaఏపీ : రూపాయికే అద్దె ఇల్లు.. ఆ అభిమానికి పవన్ అంటే ఎంత ప్రేమో?ఏపీ : రూపాయికే అద్దె ఇల్లు.. ఆ అభిమానికి పవన్ అంటే ఎంత ప్రేమో?pawan kalyan{#}kalyan;pithapuram;Akkineni Nageswara Rao;Ishtam;Pawan Kalyan;Yatra;Success;House;News;JanasenaSat, 06 Apr 2024 10:10:41 GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ సినిమాల పరంగా ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావాలని సంచలనాలు సృష్టించాలని పవన్ అభిమానుల్లో ఆశ ఉన్నా పవన్ సినిమాలకు దూరం కావడం మాత్రం అభిమానులకు అస్సలు ఇష్టం లేదు. పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా బాలయ్యలా సినిమాలు, రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
గత కొన్నిరోజులుగా జ్వరంతో బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ జ్వరం నుంచి కోలుకుని ఈరోజు నుంచి ఉత్తరాంధ్రలో వారాహి విజయభేరి యాత్ర మొదలుపెట్టనున్నారు. నెల్లిమర్ల, అనకాపల్లి, ఎలమంచిలి నియొజకవర్గాల్లో జరగనున్న బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. అయితే పవన్ తన రాజకీయ కార్యకలాపాలకు అనుగుణంగా చేబ్రోలులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
 
పవన్ స్థానికంగా సొంతింటిని నిర్మించుకునే వరకు చేబ్రోలు బైపాస్ రోడ్ లో పొలంలో నిర్మించుకున్న ఇంటిలో నివాసం ఉండనున్నారు. ఈ ఇంటి ఓనర్ పేరు ఓదూరి నాగేశ్వరరావు అని ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని సమాచారం. పవన్ పై అభిమానంతో కేవలం రూపాయి అద్దెకే మూడంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ పై అభిమానంతో ఇల్లు అద్దెకు ఇచ్చానే తప్ప డబ్బుల కోసం కాదని ఆ అభిమాని జనసేన కార్యకర్తలతో చెప్పారట.
 
పవన్ అంటే ఆ అభిమానికి ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ అభిమానులు జనసేనాని గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. భారీ మెజార్టీతో పవన్ ను గెలిపించాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారని భోగట్టా. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తానని పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనీసం 15 స్థానాలలో జనసేన విజయం సాధించేలా పవన్ ప్రణాళికలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>